రవితేజ తమ్ముడి కొడుకు మాధవ్ హీరోగా పరిచయం అవుతున్న విలేజ్ యాక్షన్ డ్రామా ‘మారెమ్మ’. మంచాల నాగరాజు దర్శకత్వంలో మయూర్ రెడ్డి బండారు నిర్మించారు. దీపా బాలు హీరోయిన్. సెప్టెంబర్ 10న సినిమా రిలీజ్. మంగళవారం ట్రైలర్‌ను హీరో రామ్ లాంచ్ చేసి టీమ్‌కు బెస్ట్ విషెస్ అందించాడు. ఈ సందర్భంగా నిర్వహించిన ఈవెంట్‌కు అతిథిగా హాజరైన దర్శకుడు శివ నిర్వాణ మాట్లాడుతూ ‘ట్రైలర్ చాలా ఇంటెన్స్‌గా ఉంది. నిజానికి ఒక డెబ్యూ హీరో ప్రేమకథతో రావాలి అనుకుంటారు. కానీ మాధవ్ కంటెంట్ బేస్డ్ సినిమాని ఎంపిక చేసుకోవడం అభినందనీయం. ఫస్ట్ సినిమాకే ఇంత హార్డ్ కంటెంట్‌ను ఎంచుకోవడం మామూలు విషయం కాదు.
బ్లాక్‌బస్టర్ కావడానికి కావాల్సిన అన్ని ఎలిమెంట్స్ ఈ చిత్రంలో ఉన్నాయి’ అని చెప్పారు. మాధవ్ మాట్లాడుతూ ‘ఈ సినిమాతో పరిచయం కావడం చాలా ఆనందంగా ఉంది. బేసిగ్గా అన్నదమ్ముల మధ్య ఒక ఎమోషన్ ఉంటుంది. కానీ ఇందులో ఒక దున్నపోతుకు, మనిషికి ఉండే అనుబంధం కొత్తగా ఉంటుంది’ అని చెప్పాడు. ఈ చిత్రంలో నటించడం హ్యాపీగా ఉందని హీరోయిన్ దీప చెప్పింది. డైరెక్టర్ నాగరాజు మాట్లాడుతూ ‘ట్రైలర్‌కి పదిరెట్లు సినిమా ఎక్సయిట్ చేస్తుంది. చివరి 20 నిమిషాల్లో గూస్‌బంప్స్ క్రియేట్ చేస్తుంది. మన ఊర్లో జరిగిన కథ చూస్తున్నట్టుగా ఉంటుంది’ అని చెప్పాడు. తప్పకుండా ఈ సినిమా అందరికీ నచ్చుతుందని నిర్మాత మయూర్ అన్నారు.
