టెస్ట్ ప్లేయర్ ఆఫ్ ది ఇయర్ 2021 సంవత్సరానికి పోటీ పడుతున్న నలుగురు ఆటగాళ్ల పేర్లను ఐసీసీ ప్రకటించింది. టీమిండియా ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్, ఇంగ్లండ్ కెప్టెన్ జో రూట్, న్యూజిలాండ్ పేసర్ కైల్ జేమిసన్, శ్రీలంక కెప్టెన్ దిముత్ కరుణరత్నే ఈ లిస్టులో ఉన్నారు.
- ఈ ఏడాది అద్భుత ఫామ్ కనబరిచిన టీమిండియా ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్.. 8 టెస్టుల్లో 52 వికెట్లు తీసిన బౌలర్ గా నిలిచారు. 28.08 సగటుతో 337 పరుగులు చేశాడు. ఇందులో ఒక సెంచరీ కూడా ఉంది.
- ఈ ఏడాది ఇంగ్లండ్ కెప్టెన్ జో రూట్ సైతం 15 టెస్టులు ఆడి 1708 పరుగులు చేశాడు. ఇందులో ఆరు సెంచరీలు ఉన్నాయి. బ్యాటింగ్ లో రాణించిన జో రూట్ కెప్టెన్ గా విఫలమయ్యాడు. ఆస్ట్రేలియాతో జరుగుతున్న యాషెస్ టెస్టులో ఇంగ్లండ్ జట్టు విఫలమైనప్పటికీ రూట్ రాణించాడు.
- కివీస్ ఆటగాడు కైల్ జేమిసన్ అరంగేట్రం చేసిన ఏడాదిలోనే మంచి పేరు తెచ్చుకున్నాడు. ఈ ఏడాది జేమిసన్ ఐదు టెస్టు మ్యాచ్ లు ఆడి 27 వికెట్లు తీశాడు. టీమిండియాతో జరిగిన టెస్ట్ సిరీస్ లో అద్భుతంగా రాణించాడు.
- శ్రీలంక కెప్టెన్ దిముత్ కరుణరత్నే ఏడు మ్యాచ్ లలో 902 పరగులు చేశాడు. సౌతాఫ్రికా, బంగ్లాదేశ్, వెస్టిండీస్ లతో జరిగిన టెస్టు సిరీస్ లలో వరుస సెంచరీలతో లంక బెస్ట్ ఓపెనర్ గా అవార్డ్ నామినేషన్ లో చోటు దక్కించుకున్నాడు.
For more news..
రాష్ట్రంలో కొత్తగా 7 ఒమిక్రాన్ కేసులు
60 ఏళ్లు పైబడిన వారికి టీకా బూస్టర్ డోస్

