రాష్ట్రంలో కొత్తగా 7 ఒమిక్రాన్ కేసులు

రాష్ట్రంలో కొత్తగా 7 ఒమిక్రాన్ కేసులు

హైదరాబాద్ : తెలంగాణలో కరోనా కొత్త వేరియెంట్ ఒమిక్రాన్ కేసులు రోజు రోజుకు పెరుగుతున్నాయి. రాష్ట్రంలో కొత్తగా ఏడుగురు ఒమిక్రాన్ బారిన పడ్డారు. వీరితో కలుపుకొని ఇప్పటి వరకు తెలంగాణలో మొత్తం 63 కేసులు నమోదయ్యాయి. హైదరాబాద్ లో ఎలాంటి ట్రావెల్ హిస్టరీ లేని ముగ్గురికి ఒమిక్రాన్ సోకడం ఆందోళన కలిగిస్తోంది. వీరిలో ఒకరు ప్రైవేట్ హాస్పిటల్ లో డయాలసిస్ టెక్నీషియన్ కాగా.. ఓ గర్భిణి, సాఫ్ట్ వేర్ ఉద్యోగికి ఒమిక్రాన్ సోకింది. కొత్త వైరస్ బారినపడిన వారిలో 46 మంది ఇతర దేశాల నుంచి వచ్చిన వారు కాగా... నలుగురిని ప్రైమరీ కాంటాక్ట్ లుగా గుర్తించారు. 63 మంది పేషెంట్లలో 14 మంది డబుల్ డోస్ వ్యాక్సిన్ తీసుకోగా.. 46మంది టీకా తీసుకోలేదని అధికారులు చెప్పారు.