అరవై ఏళ్లు పైబడిన వారికి టీకా బూస్టర్ డోస్ ఇచ్చేందుకు ఎటువంటి సర్టిఫికెట్లు చూపించాల్సిన అవసరం లేదని కేంద్ర వైద్యఆరోగ్య శాఖ స్పష్టం చేసింది. ఇవాళ (మంగళవారం) నిర్వహించిన ఓ సమావేశంలో ఈ నిర్ణయంతీసుకున్నట్లు తెలిపింది. పలు అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్నవృద్ధులకు ముందస్తు జాగ్రత్తగా బూస్టర్ డోస్ ఇవ్వాలని నిర్ణయించింది కేంద్ర ప్రభుత్వం.
అయితే వారికి ఇతర అనారోగ్య సమస్యలున్నట్లు డాక్టర్లకు సర్టిఫికెట్ ఇవ్వాలనే దానిపై ఆందోళన వ్యక్తం అవుతున్న క్రమంలో కేంద్రం ఈ సమావేశంలో క్లారిటీనిచ్చింది. అయితే బూస్టర్ డోస్ తీసుకోవాలనుకున్న వృద్ధులు తమ కుటుంబ డాక్టర్ సలహా తీసుకోవడం మంచిదని సూచించింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలను తెలిపారు కేంద్ర వైద్యశాఖ కార్యదర్శి రాకేష్ భూషణ్.
మరిన్ని వార్తల కోసం..

