ఢిల్లీలో స్కూళ్లు, కాలేజీలు బంద్ 

ఢిల్లీలో స్కూళ్లు, కాలేజీలు బంద్ 

ఢిల్లీ : కరోనా కొత్త వేరియెంట్ ఒమిక్రాన్ శరవేగంగా వ్యాపిస్తోంది. దేశ రాజధాని ఢిల్లీలో అత్యధిక కేసులు నమోదవుతున్నాయి. పాజిటివిటీ రేటు 0.5శాతానికి పెరగడంతో అప్రమత్తమైన ఢిల్లీ సర్కారు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఆంక్షలు మరింత కఠినం చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఆదేశాలు తక్షణమే అమల్లోకి వస్తాయని ప్రకటించింది. కరోనా కట్టడికి కేజ్రీవాల్ ప్రభుత్వం జారీ చేసిన ఆదేశాల ప్రకారం..

  • ఢిల్లీలో రాత్రి 10 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు నైట్ కర్ఫ్యూ కొనసాగుతుంది.
  • స్కూళ్లు, కాలేజీలు, సినిమా హాళ్లు, మల్టీప్లెక్స్ లు మూసివేత.
  • ప్రైవేటు ఆఫీసులు 50శాతం సిబ్బందితో మాత్రమే పనిచేయాలి. అత్యవసర సర్వీసులైన మీడియా, బ్యాంకులు, ఇన్స్యూరెన్స్, టెలికాం కంపెనీలకు మినహాయింపు ఇచ్చారు. 
  • పెళ్లిళ్లు, అంత్యక్రియలకు హాజరయ్యే వారి సంఖ్య 20కి పరిమితం చేశారు. 
  • మాల్స్, ఇతర దుకాణాలను సరిబేసి విధానంలో తెరవాల్సి ఉంటుంది. ఉదయం 10 గంటల నుంచి 8గంటల వరకే కార్యకలాపాలు కొనసాగించాలి. ఆన్ లైన్ డెలివరీలకు మినహాయింపు ఇచ్చారు.
  • రెసిడెన్షియల్ కాలనీల్లోని షాపులు, మార్కెట్లు సరిబేసి విధానం పాటించాల్సిన అవసరం లేదు.
  • బార్లు, రెస్టారెంట్లు 50శాతం కెపాసిటీ మేరకే పనిచేయాలి
  • ఢిల్లీ మెట్రోలో సీటింగ్ కెపాసిటీలో 50 శాతం మంది ప్రయాణీకులకే అనుమతి.
  • ఆటోలు, ఈ రిక్షాలు, ట్యాక్సీల్లో ఇద్దరు మాత్రమే ప్రయాణించాలి. 
  • సెలూన్లు, బార్బర్ షాపులు, పార్లర్లు తెరిచి ఉంటాయి. పబ్లిక్ పార్కుల్లోకి ప్రజల్ని అనుమతించినా పిక్నిక్ లు, పార్టీలకు అనుమతి లేదు. 
  • రాజకీయ, మతపరమైన సమావేశాలకు అనుమతి లేదు.

మరిన్ని వార్తల కోసం..

పంజాబ్లో కాంగ్రెస్కు ఎదురుదెబ్బ

బంగారు తెలంగాణలో అన్ని చార్జీలు పెరిగినయ్