బంగారు తెలంగాణలో అన్ని చార్జీలు పెరిగినయ్

V6 Velugu Posted on Dec 28, 2021

YSR తెలంగాణ పార్టీ అధినేత్రి వైఎస్ షర్మిల సీఎం కేసీఆర్ ను తీవ్రంగా విమర్శించారు. YSR హయాంలో ఏ రోజు కూడా ఆర్టీసీ చార్జీలు కానీ, ఇంటి పన్నులు కానీ, విద్యుత్ చార్జీలు కానీ పెరిగింది లేదంటూ ట్విట్టర్ లో ట్వీట్ చేశారు. కానీ బంగారు తెలంగాణలో కేసీఆర్ పెంచని చార్జీలంటూ లేవని ఆరోపించారు. మొన్న ఆర్టీసీ చార్జీలు పెంచి, ఇవాళ(మంగళవారం) కరెంటు చార్జీల భారం మోపారని ఆరోపించారు. 50 యూనిట్ల లోపు వాడుకునే 40 లక్షల పేదలను కూడా వదలకుండా ముక్కు పిండి వసూలు చేస్తున్నాడని తెలిపారు.

ఏడాదికి రూ.6,800 కోట్ల లోటును పూడ్చుకునేందుకు సామాన్యుడిపై విద్యుత్ భారాన్ని మోపాడని ఆగ్రహం వ్యక్తం చేశారు షర్మిల. దూకుడు ఖర్చులకు, దొర పోకడలకు తెచ్చిన అప్పుల మీద వడ్డీకి వడ్డీ ప్రజల నుంచే వసూలు చేస్తున్నాడన్నారు. జనానికి కరెంటు షాక్ ఇచ్చిన టీఆర్ఎస్ కు ఎన్నికల్లో ఓటమి షాక్ ఇచ్చేందుకు ప్రజలు రెడీగా ఉండాలంటూ షర్మిల పిలుపునిస్తూ ట్విట్టర్ లో ట్వీట్ చేశారు.

 

Tagged UP, YS Sharmila, Bangaru telangana, all charges

Latest Videos

Subscribe Now

More News