నవ్విస్తూ, భయపెడుతూ..ఓ మంచి ఘోస్ట్ 

నవ్విస్తూ, భయపెడుతూ..ఓ మంచి ఘోస్ట్ 

నందితా శ్వేత లీడ్ రోల్‌‌‌‌‌‌‌‌లో తెరకెక్కిన హారర్ కామెడీ మూవీ ‘ఓఎమ్‌‌‌‌‌‌‌‌జి’ (ఓ మంచి ఘోస్ట్). శంకర్ మార్తాండ్ దర్శకత్వంలో  డా.అబినికా ఇనాబతుని నిర్మిస్తున్నారు. వెన్నెల కిషోర్, షకలక శంకర్, నవమి గాయక్, నవీన్ నేని, రజత్ రాఘవ్, రఘుబాబు ఇతర ముఖ్యపాత్రలు పోషించిన ఈ చిత్రం జూన్ 21న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. అనూప్ రూబెన్స్ సంగీతం అందించాడు. తాజాగా ఈ మూవీ ట్రైలర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను  విడుదల చేశారు. ‘ఈ బంగ్లాలో ఒక అమ్మాయిని చంపేశారు.. ఆ అమ్మాయే దెయ్యంగా మారి అందరినీ చంపేస్తోందని కథలుకథలుగా చెప్పుకుంటున్నారు’ అనే డైలాగ్‌‌‌‌‌‌‌‌తో మొదలైన ట్రైలర్ నవ్విస్తూ.. భయపెడుతూ సాగింది.  ‘అందరి సమస్యలు వేరే అయినా వాటికి పరిష్కారం మాత్రం డబ్బు’.. అని ఓ గ్యాంగ్ పిశాచిపురంలోకి ఎంటర్ అవ్వడం ఎంటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌టైనింగ్‌‌‌‌‌‌‌‌గా ఉంటుంది. నందితా ఘోస్ట్‌‌‌‌‌‌‌‌గా  కనిపించడం, రఘుబాబు, వెన్నెల కిశోర్, షకలక శంకర్  కామెడీతో నవ్వులు పూయిస్తూ సాగిన ట్రైలర్ సినిమాపై ఆసక్తిని పెంచింది.