
హీరోయిన్‌గా చేస్తూనే పలు చిత్రాల్లో ఇంపార్టెంట్ రోల్స్‌తో ఆకట్టుకుంటుంది అంజలి. తాజాగా ఆమె ఫిమేల్ లీడ్‌గా నటిస్తున్న వెబ్ సిరీస్ ‘బహిష్కరణ’. ఆదివారం అంజలి పుట్టినరోజు సందర్భంగా ఈ సిరీస్ మోషన్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు మేకర్స్. చేతిలో వేట కొడవలి పట్టుకుని కోపంగా కూర్చున్న అంజలి ఇంటెన్స్ లుక్‌లో ఇంప్రెస్ చేస్తోంది. ఆమె పక్కన్న ఓ చెక్క కుర్చీ మంటల్లో కాలిపోతూ కనిపిస్తుండటం క్యూరియాసిటీని పెంచుతోంది. ముఖేష్ ప్రజాపతి డైరెక్షన్‌లో ప్రశాంతి మలిశెట్టి ఈ సిరీస్‌ను నిర్మిస్తున్నారు. ఇదొక విలేజ్ రివేంజ్ డ్రామా అని, ఈ సిరీస్‌లో ఆరు ఎపిసోడ్స్ ఉంటాయని దర్శక నిర్మాతలు చెప్పారు. రవీంద్ర విజయ్, శ్రీతేజ్, అనన్య నాగళ్ల, షణ్ముక్, చైతన్య సాగిరాజు, మహ్మద్ బాషా, బేబీ చైత్ర ఇతర పాత్రల్లో కనిపించనున్నారు. జీ5 ఓటీటీ ద్వారా ఈ వెబ్ సిరీస్ ప్రేక్షకుల ముందుకు రానుంది.