ICC టెస్ట్ ర్యాంకింగ్స్: రవీంద్ర జడేజా నంబర్‌ 1

ICC టెస్ట్ ర్యాంకింగ్స్: రవీంద్ర జడేజా నంబర్‌ 1

టీంఇండియా క్రికెటర్‌, స్టార్‌ ఆల్‌ రౌండర్‌ రవీంద్ర జడేజా అరుదైన ఘనత సాధించాడు. వరల్డ్ నంబర్‌ వన్‌ ఆల్‌రౌండర్‌గా స్థానం దక్కించుకున్నాడు.ICC లేటెస్టుగా విడుదల చేసిన టాప్‌ ఆల్‌రౌండర్ల లిస్టులో మొదటి స్థానంలో నిలిచాడు. రెండు రేటింగ్‌ పాయింట్ల ఆధిక్యంతో జేసన్‌ హోల్డర్‌ (384)ను రెండో స్థానానికి పరిమితం చేశాడు. బెన్‌స్టోక్స్‌ (377), రవిచంద్రన్‌ అశ్విన్‌ (353), షకిబ్‌ అల్‌ హసన్‌ (338).. ఆ తర్వాతి స్థానాల్లో వరుసగా నిలిచారు.

బౌలర్ల లిస్టులో అశ్విన్‌ టాప్‌-5లో ఉన్నాడు. 850 రేటింగ్‌ పాయింట్లతో రెండో స్థానంలో కొనసాగుతున్నాడు. ప్యాట్‌ కమిన్స్‌ (908)  ఫస్ట్ ప్లేస్ లో ఉండగా .. టిమ్‌ సౌథీ (830) మూడో ర్యాంకులో నిలిచాడు.

బ్యాట్స్‌మన్‌ జాబితాలో టీంఇండియా కెప్టెన్ విరాట్‌ కోహ్లీ (814) నాలుగో స్థానంలో నిలిచాడు. ఆసీస్‌ మాజీ కెప్టెన్ స్టీవ్‌స్మిత్‌ (891), కివీస్‌ కెప్టెన్‌ కేన్‌ విలియమ్సన్‌ (886), మార్నస్‌ లబుషేన్‌ (878) వరుసగా 1, 2, 3 ర్యాంకుల్లో కొనసాగుతున్నారు. ఇంగ్లాండ్‌ కెప్టెన్ జో రూట్‌ (797) ఐదో స్థానంలో ఉండగా రిషభ్‌ పంత్‌, రోహిత్‌ శర్మ 747 పాయింట్లతో సంయుక్తంగా ఆరో స్థానంలో నిలిచారు.

మరిన్ని వార్తలు