తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన యూట్యూబర్ కోమిలి సూసైడ్ కేసు మిస్టరీ వీడింది. తను ఇష్టపడ్డ వ్యక్తిని ఇంటికి రప్పించుకుని.. అతను వెళ్లిన తర్వాత సూసైడ్ ఆత్మహత్యకు పాల్పడటం పలు అనుమానాలకు తావిచ్చింది. వీరిద్దరి మధ్య ఏం జరిగింది..? ఇది హత్య, ఆత్మహత్య..? అనే అనుమానాలు చాలా మందిలో నెలకొన్న తరుణంలో.. సూసైడ్ కు సంబంధించిన కారణాలను రాయదుర్గం ఇన్స్పెక్టర్ వెంకన్న వెల్లడించారు.
ఇన్ స్పెక్టర్ వెంకన్న V6 కు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. తన ప్రేమను అఖిల్ నిరాకరించడం వల్లే కోమలి సూసైడ్ చేసుకుంది. అఖిల్ కోమలి ఇద్దరూ విశాఖపట్నం కు చెందినవారు. అక్కడే ఇద్దరికి పరిచయం. ఆ తర్వాత కోమలి చదువు నిమిత్తం హైదరాబాద్ వచ్చింది, జాబ్ నిమిత్తం అఖిల్ హైదరాబాద్ వచ్చాడు.
తాను ప్రేమిస్తున్న విషయం కోమలి అఖిల్ కి చెప్పింది.. అఖిల్ ఆమె ప్రేమను నిరాకరించాడు. అప్పటికే అఖిల్ వేరే అమ్మాయితో రిలేషన్ లో ఉండడం వల్ల ఆమె ప్రేమను నిరాకరించాడు. దీంతో ఆరు నెలల క్రితం కోమలి ఓసారి సూసైడ్ అటెంప్ట్ చేసింది. ఆ సమయంలోనే కోమలి అఖిల్ ను ప్రేమిస్తున్న విషయం ఆమె తల్లికి తెలిసింది. దీంతో కోమలిని పెళ్లి చేసుకోవాలని తల్లి అఖిల్ ను అడిగింది. అందుకు అతను నిరాకరించాడు.
►ALSO READ | యూట్యూబర్ కోమలి ఇంటికి అఖిల్ ఎందుకెళ్లాడు.. ఆత్మహత్య ముందు రోజు ఏం జరిగింది..!
అఖిల్ తన ప్రేమను నిరాకరించడంతో సూసైడ్ చేసుకోవాలని నిర్ణయించుకున్న కోమలి.. సూసైడ్ కి ముందు మాట్లాడదామని అఖిల్ ను ఇంటికి పిలిచింది. అప్పుడు కూడా ప్రేమ ప్రస్తావన తీసుకొచ్చినపుడు అఖిల్ నిరాకరించాడు. తన ప్రేమను అఖిల్ అంగీకరించక పోవడంతోనే ఆమె ఆత్మహత్య చేసుకుంది. తన డైరీలో కూడా అఖిల్ ప్రేమను అంగీకరించకపోవడం అనే విషయం రాసుకుంది... అని సూసైడ్ కు సంబంధించిన వివరాలు వెల్లడించారు ఇన్ స్పెక్టర్ వెంకన్న. కోమలి ఆత్మహత్యలో అఖిల్ ప్రమేయం ఉందని తెలిస్తే అతనిపై తప్పకుండా కేసు నమోదు చేస్తామని ఈ ఆయన సందర్భంగా చెప్పారు.
