'సిటిజన్ అఫ్ ఇండియా'గా రానున్న రామ్ చరణ్!

'సిటిజన్ అఫ్ ఇండియా'గా రానున్న రామ్ చరణ్!

రాజమౌళి సినిమా ‘ఆర్ఆర్ఆర్’ తర్వాత మరో భారీ చిత్రాల దర్శకుడు శంకర్ డైరెక్షన్ లో నటిస్తున్నాడు రామ్ చరణ్. దిల్ రాజు నిర్మిస్తున్న ఈ చిత్రంలో కియారా అద్వాని హీరోయిన్ గా నటిస్తోంది. శంకర్ మార్క్ సోషల్ మెసేజ్ తో పాటు హై ఓల్టేజ్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా రూపొందిస్తున్నారు. జెట్ స్పీడ్ తో షూటింగ్ జరుగుతోంది. ఆ మధ్య లోకేషన్ స్టిల్స్ కూడా లీక్ అయ్యాయి. అయితే టైటిల్ ఏమిటనేది మాత్రం ఇంతవరకూ రివీల్ చేయలేదు. గతంలో విశ్వంభర, సర్కారోడు అనే టైటిల్స్ వినిపించాయి. ఇటీవల ‘అధికారి’ అనే టైటిల్ తెరపైకొచ్చింది. చరణ్ ఇందులో ఐఏఎస్ ఆఫీసర్ గా నటిస్తున్నాడు కనుక ఇదే దాదాపుగా కన్ ఫామ్ అనుకున్నారు.

కానీ తాజాగా మరో టైటిల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ప్రచారంలోకి వచ్చింది. అదే ‘సిటిజన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌’. ప్యాన్ ఇండియా మూవీ కావడంతో హిందీతో పాటు దక్షిణాది భాషలన్నింటిలో క్యాచీగా ఉండే టైటిల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో రావాలని భావించిన టీమ్, ఈ టైటిల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను పరిశీలిస్తున్నారట. మరి దీన్నైనా ఫైనల్ చేస్తారా మరో టైటిల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను ఎంపిక చేస్తారా అనే ఆసక్తి నెలకొంది. ఇక ఇందులో చరణ్ సివిల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సర్వెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గానే కాక పొలిటీషియన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గానూ కనిపిస్తాడనే టాక్ ఉంది. జయరామ్, సునీల్, అంజలి, నవీన్ చంద్ర ఇతర ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. తమన్ సంగీతం అందిస్తున్నాడు.