ఐపీల్ సీజన్ -15లో భాగంగా నేడు ఢిల్లీతో జరుతున్న మ్యాచ్ లో ఆర్సీబీ అదరగొట్టింది. టాస్ ఓడి ఫస్ట్ బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ.. ప్రారంభంలోనే కీలక 3 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. అయితే తర్వాత వచ్చిన మ్యాక్స్ వెల్ ఆచితూచి ఆడుతూ బౌండరీలు బాదాడు. ఈ క్రమంలో మ్యాక్సీ(53) హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. చివర్లో దినేష్ కార్తీక్ దంచి కొట్టాడు. కేవలం 34 బాల్స్ లోనే (66) రన్ చేశాడు. దీంతో నిర్ణీత 20 ఓవర్లలో ఆర్సీబీ 5 వికెట్ల నష్టానికి 189 రన్స్ చేసింది.

