సాయంత్రం వరకు మృతదేహాలను కుటుంబ సభ్యులకు అందజేస్తాం

సాయంత్రం వరకు మృతదేహాలను కుటుంబ సభ్యులకు అందజేస్తాం

దిశ నిందితుల మృతదేహాలకు రీ పోస్ట్ మార్టమ్ జరుగుతుందని అన్నారు గాంధీ హాస్పిటల్ సూపరిటెండెంట్ డా. శ్రవన్. ఎయిమ్స్ నుంచి నలుగురు వైద్యుల బృందం రీ పోస్ట్ మార్టమ్ చేయడానికి వచ్చారని ఆయన చెప్పారు. మృతుల చుట్టాలతో వైద్య బృందం ముందుగా మాట్లాడారు. డెడ్ బాడీలను కుటుంబ సభ్యలు గుర్తించిన తరువాతనే పోస్ట్ మార్టమ్ మొదలైందని అన్నారు. పోస్ట్ మార్టమ్ ను వీడియో రికార్డింగ్ చేస్తున్నట్లు చెప్పారు. రిపోర్ట్స్ అన్ని రహస్యంగా జరుగుతున్నాయని.. సీడీ, పెన్ డ్రైవ్ ద్వారా హైకోర్టుకు రిపోర్ట్ అందజేస్తామని ఆయన చెప్పారు. మెడికల్ బృందానికి చైర్మన్ లీడింగ్ చేస్తున్నారని తెలిపారు. సాయంత్రం 5 గంటల లోపు మృతదేహాలను కుటుంబ సభ్యులకు అందిస్తామని చెప్పారు. రెండు అంబులెన్స్ లలో వారి వారి గ్రామాలకు పంపిస్తామని తెలిపారు.

రీ పోస్ట్ మార్టం లో గాంధీ డాక్టర్లు ఎవ్వరూ పాల్గొనడం లేదని చెప్పారు డా. శ్రవన్. గతంలో ఫోరెన్సిక్ వైద్యులు చేసింది ఏంటో తమకు తెలీయదని అన్నారు. రిపోర్ట్ రెండు రోజుల్లో ఇవ్వాలని ఆదేశాలు ఉన్నాయని తెలిపారు. 4రోజులు రీఫ్రిజిరేటర్ లో పెట్టడంవల్ల..50శాతానికి పైగా మృతదేహాలు డి కంపోజ్ అయ్యాయని చెప్పారు. ప్రత్యేక వైద్యుల బృందం అడిగిన యంత్ర పరికరాలను  సమకూర్చామని తెలిపారు. వింటర్ సీజన్ వల్ల డెడ్ బాడీలు ఇంకా మొత్తం పాడవలేదని.. సమ్మర్ లో అయితే మూడు రోజుల్లో బాడీస్ డీ కంపోజ్ అయిపోతాయని ఆయన చెప్పారు. ఒక్కో బాడీ రీ పోస్ట్ మార్టం చేసేందుకు 1 గంట సమయం పట్టే అవకాశం ఉందని అన్నారు.