వేసవి సెలవుల అనంతరం పునః ప్రారంభానికి స్కూళ్లు సిద్ధమవుతున్నాయి. నిజామాబాద్ జిల్లా జక్రాన్ పల్లి మండలం నారాయణపేట గ్రామంలోని ప్రభుత్వ ప్రీ ప్రైమరీ స్కూల్‌ను పిల్లలను ఆకట్టుకునేలా తీర్చిదిద్దారు. స్కూల్ ప్రాంగణాన్ని అందమైన పెయింటింగ్స్‌తో ప్రైవేట్ స్కూళ్లకు దీటుగా ముస్తాబు చేశారు. స్కూల్‌కు వచ్చే చిన్నారులు ఆడుకునేందుకు అన్ని రకాల ఆట వస్తువులు అందుబాటులో ఉంచారు.
