
పరిగి, వెలుగు: కోట్లు విలువ చేసే భూమిని లక్షల్లోనే కొనుగోలు చేయడంపై గ్రామస్తులు నిలదీయంతో రియల్టర్లు కత్తులతో బెదిరింపులకు దిగినట్లు బాధితులు ఆరోపించారు. వివరాల్లోకెలితే.. వికారాబాద్‌జిల్లా పూడూరు మండలంలోని రాకంచెర్ల గ్రామానికి చెందిన కుర్వ పద్మమ్మకు కొడుకు సురేశ్, ఇద్దరు కూతుర్లు ఉన్నారు. సురేశ్మానసికంగా బాగా లేడు. పద్మమ్మ పెద్ద ఉమ్మెంతాల్ గ్రామంలో తమ రెండెకరాల పొలాన్ని హైదరాబాద్‌లోని లింగంపల్లికి చెందిన రియల్టర్‌కు అమ్మేసింది.
ఈ భూమి రూ.5 కోట్లు పలుకుతుండగా రూ.5 లక్షలకే అమ్మినట్లు తెలిసింది. దీనిపై భూమి అమ్మేసిన పద్మమ్మ నోరు విప్పడం లేదు. మానసికంగా బాగా లేని సురేశ్‌కు చెప్పకుండానే భూమి అమ్మడంతో గ్రామస్తులు ఆయన తరఫున రియల్టర్‌ను నిలదీశారు. దీంతో రియల్టర్ హైదరాబాద్‌నుంచి మరికొందరు రియల్టర్లను తీసుకొచ్చి గ్రామస్తులతో వాగ్వాదానికి దిగాడు. విషయం చన్గోముల్పోలీస్స్టేషన్కు చేరుకోగా అక్కడ రియల్టర్లు కత్తులతో బెదిరింపులకు పాల్పడినట్లు గ్రామస్తులు ఆరోపించారు. వారి ఫిర్యాదుతో రియల్టర్లను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.