ఉత్కంఠను రేకెత్తిస్తోన్న "రెక్కీ" ట్రైలర్

ఉత్కంఠను రేకెత్తిస్తోన్న "రెక్కీ" ట్రైలర్

తాడిపత్రి నేపథ్యంలో రూపుదిద్దుకున్న క్రైమ్ అండ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ "రెక్కీ"లో శివ బాలాజీ, శ్రీరామ్, ధన్య బాలకృష్ణ తదితరులు ప్రధాన పాత్రలను పోషించారు. పోలూరు కృష్ణ దర్శకత్వంలో వచ్చిన ఈ సిరిస్ కు సంబంధించిన పోస్టర్ ను ఇటీవలే రిలీజ్ చేశారు. తాజాగా ట్రైలర్ ను కూడా విడుదల చేశారు నిర్వాహకులు. 1990లో చోటు చేసుకున్న కొన్ని సంఘటనల ఆధారంగా వస్తోన్న ఈ సిరీస్ పోస్టర్ లో అందరూ సీరియస్ గా చూస్తుండడం గమనించవచ్చు. కాగా ఇప్పుడు రిలీజైన ట్రైలర్ కూడా ఆద్యంతం ఆసక్తి, ఉత్కంఠను రేకెత్తిస్తోంది. ఇకపోతే జీ 5లో ఈ నెల 17న "రెక్కీ" స్ట్రీమింగ్ కానున్నట్టు ప్రకటించిన విషయం కూడా తెలిసిందే.