ఏ బ్యాంకులో ఎంత వడ్డీ.?

ఏ బ్యాంకులో ఎంత వడ్డీ.?

ఈక్విటీలు మ్యూచువల్‌‌ ఫండ్లు ఎన్సీడీల వంటి ఇన్వెస్ట్‌‌మెంట్ల వంటి వాటితో పోలిస్తే ఫిక్స్‌‌డ్‌‌ డిపాజిట్లు (ఎఫ్‌‌డీలు) ఎంతో సేఫ్‌‌. మార్కెట్ల ఒడిదొడుకులతో వీటి సంబంధం ఉండదు. ఎంత కాలానికి అయినా డిపాజిట్‌‌ చేసుకోవచ్చు. వీటిపై లోన్లకు కూడా పొందవచ్చు. ఎంత తక్కువ మొత్తాన్ని అయినా ఎఫ్‌‌డీగా మార్చుకోవచ్చు. సీనియర్‌‌ సిటిజన్‌‌ అయితే ఎఫ్‌‌డీలపై మరికొంత వడ్డీ వస్తుంది. ఎఫ్‌‌డీలపై వడ్డీరేట్లు తక్కువగా ఉంటాయన్న మాట నిజమే అయినా వీటిలో ఇన్వెస్ట్‌‌మెంట్లకు మాత్రం ఢోకా ఉండదు.ఇటీవల కొన్ని బ్యాంకులు రేట్లను మార్చాయి. కొత్తరేట్లు ఎలా ఉన్నాయో చూద్దాం.

- బిజినెస్‌‌ డెస్క్‌‌ వెలుగు
స్టేట్ బ్యాంక్: మనదేశంలోనే అతిపెద్దదైన స్టేట్ బ్యాంక్  తన కస్ట మర్ల ఎఫ్‌‌డీలపై 2.9 శాతం 5.4 శాతం వరకు వడ్డీ రేటు ఇస్తోంది. సీనియర్ సిటిజన్లు 3.40 శాతం నుంచి 6.20 శాతం వరకు పొంద వచ్చు. ఈ కొత్త రేట్లు ఈ ఏడాది జనవరి నుంచి అమల్లోకి వచ్చాయి. 

హెచ్‌‌డీఎఫ్‌‌సీ బ్యాంక్: హెచ్‌‌డీఎఫ్‌‌సీ బ్యాంక్‌‌ఈ ఏడాది మే 21 నుంచి ఎఫ్‌‌డీ రేట్లను మార్చింది. ఏడాది ఎఫ్‌‌డీలపై 4.90   వడ్డీ రేటును అందిస్తుంది.  ఇదే కాలానికి 5.40   వడ్డీ రేటును పొందవచ్చు.

ఐసీఐసీఐబ్యాంక్:  ఐసీఐసీఐబ్యాంక్ సాధారణ కస్టమర్లకు ఏడాది ఎఫ్‌‌డీలపై 3 శాతం నుంచి 6.30 శాతం వరకు వడ్డీ ఇస్తుంది. సీనియర్ సిటిజన్లకు 5.75 శాతం వరకు వడ్డీ ఉంటుంది. వడ్డీరేట్లలో మార్పులు గత ఏడాది అక్టోబరు నుండి అమల్లోకి వచ్చాయి.

యాక్సిస్ బ్యాంక్: ఈ ప్రైవేట్ బ్యాంక్ సాధారణ కస్టమర్లకు ఏడాది ఎఫ్‌‌డీలపై 2.50 శాతం నుంచి 5.1 శాతం వరకు వడ్డీ ఇస్తుంది. సీనియర్ సిటిజన్లకు 5.75 శాతం వడ్డీ ఉంటుంది. వడ్డీరేట్లలో మార్పులు ఈ ఏడాది జూన్ 22 నుండి అమల్లోకి వచ్చాయి.

యెస్ బ్యాంక్: యెస్ బ్యాంక్ తన తన సాధారణ కస్టమర్లకు 3.25 శాతం నుంచి 6.5 శాతం వరకు, సీనియర్ సిటిజన్లకు 3.75 శాతం నుంచి 7.25 శాతం వడ్డీ రేటును అందిస్తుంది.  కొత్త వడ్డీ రేట్లు గత నెల నుండి అమలులోకి వచ్చాయి.