
ఇండియా, పాకిస్తాన్ దేశాల మధ్య హై టెన్షన్ నెలకొంది. ఈ క్రమంలోనే పాకిస్తాన్ సరిహద్దుల్లో ఉన్న రాష్ట్రాల్లో రెడ్ అలర్ట్ ప్రకటించారు. ముఖ్యంగా రాజస్థాన్ రాష్ట్రంలోని మూడు నగరాల్లో రెడ్ అలర్ట్ జారీ చేస్తూ.. ఆయా జిల్లాల కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మూడు నగరాల్లో.. జనం బయట తిరగొద్దని.. ఇళ్లల్లోనే ఉండాలంటూ మైకుల్లో అనౌన్స్ చేశారు. ఇక మార్కెట్లు అన్నీ క్లోజ్ చేశారు. షాపులు మూయించారు. పాకిస్తాన్ ఆ మూడు నగరాలను టార్గెట్ చేసే అవకాశాలు ఉన్నాయనే సమాచారం ఈ చర్యలకు దిగింది అక్కడి ప్రభుత్వం. పూర్తి వివరాల్లోకి వెళితే..
భారత్, పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తలు రోజురోజుకీ ముదురుతున్నాయి. ఒక పక్క భారత దళాల దాటికి విలవిలలాడుతున్నప్పటికీ పాక్ తన వంకర బుద్ధి చూపుతూనే ఉంది. శనివారం ( మే 10 ) భారత దళాలపై ప్రత్యక్ష యుద్దానికి సిద్ధమంటూ ఆపరేషన్ బన్‌యన్ ఉల్ మర్సూస్ ప్రారంభించనున్నట్లు ప్రకటించటంతో ఉద్రిక్తతలు మరింత తీవ్రం అయ్యాయి. ఈ క్రమంలో భారత్, పాక్ సరిహద్దు రాష్ట్రాల ప్రభుత్వాలు రెడ్ అలర్ట్ ప్రకటించాయి. ఈ క్రమంలో రాజస్థాన్ లోని బార్మర్, శ్రీగంగా నగర్, జోధ్ పూర్ లలో కఠిన ఆంక్షలు అమల్లోకి తెచ్చింది ప్రభుత్వం.
అందరూ ఇళ్లకు వెళ్లిపోవాలని.. బయట ఎవరు తిరగద్దని హెచ్చరించింది. మార్కెట్లు, షాపులు, ఆఫీసులు మూసేయాలని కోరింది. ఉదయం నుంచి రాత్రి దాకా ఎవరూ బయటికి రావద్దని.. మార్కెట్లు, షాపులు తెరవద్దని ఆదేశించింది ప్రభుత్వం. పాకిస్తాన్ సరిహద్దులు దాటి డ్రోన్ దాడులు చేసే అవకాశమున్న క్రమంలో ఈ నిర్ణయం తీసుకుంది ప్రభుత్వం. ఆయా ప్రాంతాల్లో శనివారం ( మే 10 ) ఉదయం నుంచి పూర్తి బ్లాకౌట్ ప్రకటించింది.
శ్రీ గంగానగర్‌లో పూర్తి లాక్‌డౌన్ అమల్లోకి తెచ్చింది ప్రభుత్వం. ప్రజలంతా ఇళ్లలోనే ఉండాలని.. బయట తిరగద్దని హెచ్చరించారు అధికారులు. జోధ్ పూర్, జైసల్మేర్ లో కూడా ఇదే పరిస్థితి కొనసాగుతోంది. రెడ్ అలర్ట్ ప్రకటించిన అధికారులు కఠిన ఆంక్షలు విధించారు. ఇదిలా ఉండగా.. ఢిల్లీ ని టార్గెట్ చేసుకున్న పాక్.. శనివారం ( మే 10 ) ఫతా 2 క్షిపణి ప్రయోగించింది. అయితే.. ఇండియన్ ఆర్మీ ఫతా 2 క్షిపణిని కూల్చేసింది. హర్యానాలోని సిర్సా సమీపంలో భారత వైమానిక రక్షణ దళాలు ఆ క్షిపణిని అడ్డుకుని ధ్వంసం చేసినట్లు సమాచారం.