ఇస్లామాబాద్: పాకిస్తాన్ టెర్రరిజాన్ని ప్రోత్సహిస్తున్నదని ఆ దేశ నేత, పాక్ ఆక్రమిత కాశ్మీర్ (పీఓకే) మాజీ ప్రధాని చౌదరి అన్వరుల్ హక్ స్వయంగా అంగీకరించాడు. తాము ఎర్రకోట నుంచి కాశ్మీర్ అడవుల వరకూ దాడి చేశామని వ్యాఖ్యలు చేశాడు.
పహల్గాం ఉగ్రదాడి, రెడ్‌ఫోర్ట్ బాంబ్ బ్లాస్ట్‌లను ఉటంకిస్తూ హక్ కామెంట్స్ చేసిన వీడియో ప్రస్తుతం దుమారాన్ని రేపుతున్నది. ‘‘మీరు బలూచిస్తాన్‌ను రక్తస్రావం చేస్తూనే ఉంటే, ఎర్రకోట నుంచి కాశ్మీర్ అడవుల వరకు దేశంలో దాడి చేస్తామని నేను గతంలోనే చెప్పా. దేవుడి దయతో షాహీన్లు (యువ ఉగ్రవాదులు) మేం అనుకున్నది చేశారు. వారు (భారత్) ఇప్పటికీ మృతదేహాలను లెక్కించలేకపోతున్నారు’’ అని అన్నాడు.
