చైనా మొబైల్ మేకర్ షియోమి తన తర్వాత ఫ్లాగ్ షిప్ ఫోన్ రెడ్ మి నోట్ 7ను మార్కెట్లోకి తీసుకురాబోతోంది. అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకురాబోతున్న ఈ ఫోన్ ను ఈ నెల 28న విడుదల చేయడానికి కంపెనీ సన్నాహాలు చేస్తోంది. లేటెస్ట్ ఫీచర్లు, 48 MP కెమెరాతో ఈ ఫోన్ మార్కెట్లోకి వచ్చేస్తోంది. ఫొటోగ్రఫి యూజర్లకు ఇది బెస్ట్ ఫోన్ గా నిలవనుంది. ఇందులో వెనుక భాగంలో 48 MP కెపాసిటీ ఉన్న భారీ కెమెరాను ఏర్పాటు చేశారు. 4000 MAH బ్యాటరీని ఈ ఫోన్‌లో అందిస్తున్నారు. ఈ ఫోన్ ధర రూ.10,390గా ఉండే అవకాశం ఉంది.
నోట్ 7 ఫీచర్లు…
…6.3 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లే
… 2340 ×1080 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్
… ఆక్టాకోర్ స్నాప్ డ్రాగన్ 660 ప్రాసెసర్
…3/4/6 GB ర్యామ్, 32/64 GB స్టోరేజ్, 256 GB ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్
…ఆండ్రాయిడ్ 9.0 పై, హైబ్రిడ్ డ్యుయల్ సిమ్
… 48, 5 MP డ్యుయల్ బ్యాక్ కెమెరాలు, 13 MP సెల్ఫీ కెమెరా
… ఫింగర్ ప్రింట్ సెన్సార్,IR సెన్సార్
… డ్యుయల్ 4G వీవోఎల్‌టీఈ, డ్యుయల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 5.0
… యూఎస్‌బీ టైప్ సి, 4000 MAH బ్యాటరీ, క్విక్ చార్జ్ 4.0.
