అప్పుడే.. ‘సీఎం’ నెంబర్ ప్లేట్.. ‘గోట్’ సినిమా క్లిప్ వైరల్

అప్పుడే.. ‘సీఎం’ నెంబర్ ప్లేట్.. ‘గోట్’ సినిమా క్లిప్ వైరల్

చెన్నై: తమిళ సినీ స్టార్ విజయ్ రాజకీయాల్లో సరికొత్త అధ్యాయాన్ని లిఖించారు. ఆయన స్థాపించిన టీవీకే పార్టీ 2026 అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించింది. ఈ నేపథ్యంలో 2024లో విడుదలైన ‘ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్’ (గోట్) సినిమాలోని ఒక సన్నివేశం ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతోంది. 

ఆ సినిమాలో విజయ్ నడిపిన కారు నంబర్ ప్లేట్ ‘టీఎన్ 07 సీఎం 2026’ అని ఉండటం గమనార్హం. అప్పట్లో విజయ్ సహనటుడు ప్రేమ్‌‌‌‌‌‌‌‌గి అమరన్ చెప్పినట్లుగానే 2026లో విజయ్ ముఖ్యమంత్రి అవుతారన్న అంచనాలు ఇప్పుడు నిజమయ్యాయని అభిమానులు పండగ చేసుకుంటున్నారు.