
హైదరాబాద్, వెలుగు: కాంట్రాక్టు ఉద్యోగుల రెగ్యులరైజేషన్ మొదలైంది. శాఖల వారీగా వస్తున్న వివరాలకు ఆర్థిక శాఖ ఆమోదం తెలుపుతోంది. అందుకు అనుగుణంగా సంబంధిత డిపార్ట్మెంట్లు రెగ్యులరైజేషన్ ఉత్తర్వులు జారీ చేస్తున్నాయి. ఇటీవల పంచాయతీరాజ్ అండ్ రూరల్‌డెవలప్‌మెంట్ డిపార్ట్మెంట్లో 65 మంది ఎన్ఎంఆర్ ఉద్యోగులను రెగ్యులరైజ్ చేస్తూ సెక్రటరీ సందీప్ కుమార్ సుల్తానియా ఉత్తర్వులు జారీ చేశారు. 2016లో ఇచ్చిన జీవో నెంబర్ 16 ఆధారంగా కాంట్రాక్టు ఎంప్లాయీస్‌ను రెగ్యులరైజేషన్ చేస్తున్నట్లు పేర్కొన్నారు. వీరంతా పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ విభాగం శాంక్షన్డ్ పోస్టుల్లో పనిచేస్తున్నారు. రెగ్యులరైన వాటిల్లో జూనియర్ టెక్నికల్ఆఫీసర్లు, టెక్నికల్అసిస్టెంట్, టైపిస్ట్, ఆఫీస్సబార్డినేట్లు, వాచ్మెన్ కమ్స్వీపర్ పోస్టులున్నాయి. వాస్తవానికి 70 మంది కాంట్రాక్టు ఎంప్లాయీస్‌ను రెగ్యులర్ చేయాలని ఫైనాన్స్ డిపార్ట్మెంట్కు ప్రపోజల్ పంపగా అందులో అర్హత ఉన్న 65 మందికే అనుమతి లభించింది. ఇక సీఎం కేసీఆర్ రెగ్యులరైజ్ చేస్తామన్న 11,103 పోస్టుల్లో ఎక్కువగా ఎడ్యుకేషన్, హెల్త్ డిపార్ట్మెంట్లలోనే ఉన్నాయి. హెల్త్‌లో స్టాఫ్ నర్సులు, ఎడ్యుకేషన్‌లో ఇంటర్మీడియెట్, డిగ్రీ ప్రభుత్వ కాలేజీల్లో పనిచేస్తున్న కాంట్రాక్టు లెక్చరర్లు ఉన్నారు. ఈ రెండింటిలోనే 9 వేల మంది దాకా ఉన్నట్లు ఆఫీసర్లు చెప్తున్నారు. అయితే వీటి వివరాలు ఇంకా ఆర్థిక శాఖకు అందలేదు.
శాంక్షన్డ్ పోస్టులో ఉంటేనే రెగ్యులరైజ్
2016లో జారీ చేసిన జీఓ ప్రకారమే రెగ్యులరైజేషన్ ఉత్తర్వులు ఇస్తున్నారు. దీని ప్రకారం శాంక్షన్డ్ పోస్టులో ఉండి, రోస్టర్ పాయింట్, రూల్ ఆఫ్ రిజర్వేషన్ వంటివి ఉన్న కాంట్రాక్టు ఉద్యోగులనే రెగ్యులర్ చేస్తున్నారు. శాంక్షన్డ్ పోస్టులో పనిచేయకుంటే వారిని అనర్హులుగా గుర్తిస్తున్నారు. ప్రభుత్వ శాఖల్లో పనిచేస్తున్న వారినే రెగ్యులరైజేషన్ చేయనున్నారు. గ్రాంట్ఇన్ఎయిడ్ సంస్థల్లో పనిచేస్తున్న కాంట్రాక్టు ఉద్యోగుల వివరాలూ ఫైనాన్స్ డిపార్ట్మెంట్కు అందుతున్నాయి. దాదాపు రెండు వేల మంది ఉద్యోగుల వివరాలు ఫైనాన్స్ డిపార్ట్మెంట్కు అందినట్లు తెలిసింది.