తిరుమలలో ఏకాదశి ఆన్‌ లైన్‌ కోటా విడుదల

తిరుమలలో ఏకాదశి ఆన్‌ లైన్‌ కోటా విడుదల

తిరుమల: భక్తుల సౌకర్యార్థం వైకుంఠ ఏకాదశి సందర్భంగా డిసెంబర్‌ 25 నుంచి జనవరి 3వ తేదీ వరకు రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటాను (రోజుకు దాదాపు 20 వేల టికెట్లు) శుక్రవారం ఉదయం 6.30 గంటలకు టీటీడీ ఆన్‌లైన్‌లో విడుదల చేసింది. www.tirupatibalaji.ap.gov.in వెబ్‌ సైట్‌ ద్వారా భక్తులు టికెట్లు బుక్‌ చేసుకోవచ్చు.

తిరుమలలోని అన్నమయ్య భవన్ లో డయల్ యువర్ ఈవో కార్యక్రమంలో పాల్గోన్నారు టీటీడీ ఈవో జవహర్ రెడ్డి. ఫోన్ ద్వారా 26 మంది భక్తుల వద్ద నుండి సలహాలు, సూచనలు తీసుకున్నారు. తిరుపతిలో పది రోజుల పాటు ప్రత్యేక కేంద్రాల్లో రోజుకి పది వేల టిక్కెట్లను భక్తులకు అందుబాటులో ఉంచుతామన్నారు.కార్తీక మాసం సందర్భంగా మొదటి సారిగా వసంత మండపంలో‌, కపిలతీర్ధంలో, నాదనీరాజనంలో ప్రత్యేక ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించామన్నారు. వయోవృద్దులు, చంటిపిల్లలు, గర్భిణులు, కోవిడ్-19 నిబంధనలు పాటిస్తూ స్వామి వారిని దర్శించుకోవచ్చన్నారు.