Warangal student: ప్రీతి ఆరోగ్యం పై హెల్త్ బులిటెన్ విడుదల

Warangal student: ప్రీతి ఆరోగ్యం పై హెల్త్ బులిటెన్ విడుదల

హైదరాబాద్ నిమ్స్‭లో చికిత్స పొందుతున్న ప్రీతి ఆరోగ్యం పై వైద్యులు హెల్త్ బులిటెన్ విడుదల చేశారు. ప్రీతి నిమ్స్‭లో జాయిన్ అయ్యేటప్పటికీ మల్టీ ఆర్గాన్ ఫెయిల్యూర్ ఉందని వైద్యులు చెప్పారు. ప్రీతిని వెంటిలేటరీ అయానోట్రోపిక్ సపోర్టుతోనే నిమ్స్‭కు తరలించారని అన్నారు. ప్రస్తుతం కార్డియాక్ &  శ్వాస కోశ సమస్యలు ఉన్నాయని చెప్పారు. స్పెషలిస్ట్ వైద్యుల సహాయంతో చికిత్స అందిస్తున్నామని నిమ్స్ డాక్టర్లు తెలిపారు. మరోవైపు ప్రీతిని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సతీమణి ఉష పరామర్శించారు. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న సైఫ్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.