రిటైల్ దిగ్గజం మెట్రోను సొంతం చేసుకున్న రిలయన్స్

రిటైల్ దిగ్గజం మెట్రోను సొంతం చేసుకున్న రిలయన్స్

దేశంలో రిటైల్ మార్కెట్ ను రిలయన్స్ ఇండస్ట్రీస్ మరింత బలోపేతం చేసుకుంటోంది. జర్మనీకి చెందిన మెట్రో ఏజీ కంపెనీని సొంతం చేసుకునేందుకు రూ. 2,850 కోట్లకు డీల్ కుదుర్చుకుంది. ఈ మేరకు రిలయన్స్ రిటైల్‌ వెంచర్స్‌ లిమిటెడ్‌ (ఆర్‌ఆర్‌వీఎల్‌), మెట్రో క్యాష్‌ అండ్‌ క్యారీ ఇండియా ప్రైవేట్‌ లిమిటెడ్‌ ఒక్కటి కానున్నాయి. ఈ డీల్ కి సంబంధించిన పత్రాలపై ఆయా కంపెనీలకు చెందిన ఉన్నతాధికారులు సంతకాలు కూడా చేశారు.

పూర్తిగా నగదుతో కూడిన ఈ లావేదేవీలు 2023 మార్చి కల్లా పూర్తవుతాయని కంపెనీలు అంచనా వేస్తున్నాయి. 2003లో ప్రారంభంమైన మెట్రో క్యాష్ అండ్ క్యారీ బిజినెస్ తో దేశ వ్యాప్తంగా 21 నగరాల్లో 31 స్టోర్లు నెలకొన్నాయి. అందులో 3,500 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. అయితే, రిలయన్స్ మెట్రోని కొనుగోలు చేయడం వల్ల కొత్తగా 30 లక్షల మంది కస్టమర్లు రిలయర్స్ కంపెనీకి ఖాతాదారులవుతారు. వాళ్ల వల్ల ఏటా రూ.7,700 కోట్లు బిజినెస్ జరుగుతుందని అంచనా.