ఇన్వెస్ట్​మెంట్లతో భారీ లాభాలు

ఇన్వెస్ట్​మెంట్లతో భారీ లాభాలు
  • వెల్లడించిన మోర్గన్​ స్టాన్లీ 
  • స్టాక్​ టార్గెట్​ ధర పెంపు

న్యూఢిల్లీ:రిలయన్స్  రాబోయే రెండుమూడేళ్లలో చేయబోయే కొత్త ఇన్వెస్ట్​మెంట్ల ద్వారా భారీగా లాభాలను ఖాతాలో వేసుకుంటుందని గ్లోబల్ బ్రోకరేజ్ మోర్గాన్ స్టాన్లీ ఒక రిపోర్టులో వెల్లడించింది. కీలక వ్యాపారాలను ముందుకు తీసుకెళ్లడానికి 50 బిలియన్ డాలర్లను కేటాయించడంతో  గ్రూపు ఆదాయం రెట్టింపు అవుతుందని అంచనా వేసింది. దీంతో కంపెనీ షేర్లు సోమవారం ట్రేడింగ్ సెషన్‌‌‌‌లో బిఎస్‌‌‌‌ఇలో దాదాపు 2శాతం పెరిగి రూ.2,581కి చేరాయి. రిలయన్స్​ షేర్​ టార్గెట్​ధరను కూడా రూ. 3,015 నుంచి రూ.3,085లకు పెంచింది. ఈ రిపోర్టు ప్రకారం.. ఎనర్జీ బిజినెస్​లు 2027 నాటికి లాభాలను రెట్టింపు చేసే అవకాశం ఉంది.రాబోయే మూడేళ్లలో రసాయనాలు, 5జీ, రిటైల్ బిజినెస్​లపై రిలయన్స్​ భారీగా ఇన్వెస్ట్​ చేయనుంది. రిటైల్, టెలికాం, న్యూఎనర్జీల కోసం ఇన్వెస్ట్​మెంట్లలో 25శాతం మొత్తాన్ని కేటాయించవచ్చు. నాలుగో ఇన్వెస్ట్​మెంట్​ సైకిల్​తో​  గ్రీన్ ఇన్‌‌‌‌ఫ్రాస్ట్రక్చర్‌‌‌‌లో దూసుకెళ్లడానికి చాన్సులు ఉన్నాయి. కేవలం దేశీయ మార్కెట్లోనే కాకుండా అంతర్జాతీయ అవకాశాలను.. ముఖ్యంగా కొత్త ఇంధనం,  రసాయనాల రంగంలో అవకాశాలను దక్కించుకోవచ్చు. క్వాల్‌‌‌‌కామ్‌‌‌‌తో చేతులు కలపడం ద్వారా టెలికం బిజినెస్ ​విస్తరించే అవకాశాలు కనిపిస్తున్నాయి. 5జీ లాంచ్, ఎఫ్​ఎంసీజీ సెక్టార్​లోకి ప్రవేశించడం, ఓ2సీ బిజినెస్ ​విస్తరణ గురించి పోయిన వారం జరిగిన కంపెనీ ఏజీఎంలో కంపెనీ పలు విషయాలను వెల్లడించింది.  రిలయన్స్​ జియో 5జీ డిసెంబర్ 2023 నాటికి దేశమంతటా అందుబాటులో ఉంటుంది. ఇందుకు రూ.రెండు లక్షల కోట్లు ఖర్చు చేస్తారు.  రిలయన్స్​ 2023/24/25 ఆర్థిక సంవత్సరాల తమ క్యాపెక్స్ అంచనాలను భారీగా పెంచిందని గ్లోబల్ బ్రోకరేజ్ జెఫరీస్ పోయిన వారం తెలిపింది.   

ఎఫ్​ఎంసీజీ బ్రాండ్లపై నజర్​   
రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ తన ఫాస్ట్ మూవింగ్ కన్స్యూమర్ గూడ్స్ (ఎఫ్​ఎంసీజీ) బిజినెస్​ను బలోపేతం చేయడంలో భాగంగా పలు బ్రాండ్లను కొనేందుకు ప్రయత్నాలు మొద లుపెట్టింది. సబ్బులు, పేస్టులు, షాంపూల వంటి వాటిని ఎఫ్​ఎంసీజీ ప్రొడక్టులని పిలుస్తారు.  కావి న్‌‌‌‌కేర్ నుంచి గార్డెన్ నామ్‌‌‌‌కీన్స్ వంటి బ్రాండ్‌‌‌‌లను కొనుగోలు చేయడానికి రిలయన్స్​సంప్రదింపులు జరుపు తోంది. లాహోరీ, జీరా,  బిందు బెవరేజెస్ వంటి ఇతర బ్రాండ్‌‌‌‌లను తన ఖాతాలో వేసుకోవడానికి చర్చిస్తోంది. ఢిల్లీకి చెందిన ప్యూర్ డ్రింక్స్ గ్రూప్ నుంచి  కాంపా అనే కూల్​డ్రింక్స్​ బ్రాండ్​ను రిలయన్స్ రూ.22 కోట్లకు కొన్నట్టు పోయినవారం కంపెనీ వెల్లడించింది.  రిలయన్స్ మరో మూడు కంపెనీలతో జరుపుతున్న చర్చలు త్వరలోనే ముగిసే అవకాశాలు కనిపిస్తున్నాయి.  ప్రస్తుతం డీల్ నియమాలపై సమాలోచనలు జరుగుతున్నాయి. ప్యాకేజ్డ్ డ్రింకింగ్ వాటర్ బ్రాండ్ బిందు మినరల్ వాటర్‌‌‌‌ రిలయన్స్​ చేతికి వచ్చే అవకా శాలు కనిపిస్తున్నాయి. ఇది ఫిజ్ జీరా మసాలా డ్రింక్​ను 2002లో ప్రారంభించింది. లాహోరీ జీరాతో పాటు, నింబూ, కచా ఆమ్  షికంజీ వంటి ఇతర రుచులలో లాహోరీ డ్రింక్స్​ అందుబాటులో ఉన్నాయి. సంప్రదాయ భారతీయ రుచులను పరిచయం చేయడానికి వీటిని తీసుకొచ్చినట్టు కంపెనీ తన వెబ్‌‌‌‌సైట్‌‌‌‌లో పేర్కొంది. రాబోయే కొన్నేళ్లలో భారత్ కన్జూమర్​ రంగంలో మరింత కన్సాలిడేషన్ కనిపిస్తుందని ఎక్స్​పర్టులు చెబుతున్నారు.