న్యూఢిల్లీ: పారిశ్రామికవేత్త అనిల్ అంబానీకి చెందిన రిలయన్స్ పవర్ సంస్థపై అక్రమ నగదు చలామణి దర్యాప్తులో భాగంగా ఈడీ శుక్రవారం ముంబై, హైదరాబాద్లో సోదాలు నిర్వహించింది. సుమారు 12 ప్రాంతాల్లో ఈ తనిఖీలు జరిగాయి. సంస్థ ఉన్నతాధికారుల ఇండ్లు, ఆఫీసుల్లో వెతికారు.
బ్యాంకు మోసానికి సంబంధించిన అక్రమ నగదు చలామణి కేసులో భాగంగా అంబానీ కంపెనీలపై ఈడీ విచారణ జరుపుతోంది. దర్యాప్తు సంస్థ కీలక పత్రాలు స్వాధీనం చేసుకునే అవకాశం కనిపిస్తోంది. భారీ ఎత్తున జరిగిన ఆర్థిక లావాదేవీల మీద నిఘా పెట్టిన అధికారులు నిందితుల నుంచి సమాచారం సేకరిస్తున్నారు.
