ఇంటర్‌‌‌‌‌‌‌‌లో కాలేజీల్లో ‘తెలుగు’కు మంగళం

ఇంటర్‌‌‌‌‌‌‌‌లో కాలేజీల్లో ‘తెలుగు’కు మంగళం
  • ఇంటర్‌‌‌‌‌‌‌‌లో కాలేజీల్లో సెకండ్ ల్వాంగేజ్‌‌‌‌‌‌‌‌గా సంస్కృతం
  • బోర్డు సెక్రటరీ జలీల్‌‌‌‌‌‌‌‌ ఉత్తర్వులు
  • ఎమ్మెల్సీ కవిత రిఫరెన్స్‌‌‌‌‌‌‌‌తోనే నిర్ణయమని ప్రకటన  

హైదరాబాద్, వెలుగు: మూడేండ్ల కింద ప్రపంచ తెలుగు మహాసభలు నిర్వహించి తెలుగు భాష పరిరక్షణకు చర్యలు తీసుకుంటామని ప్రకటించిన సర్కారు.. తాజాగా గవర్నమెంట్‌‌‌‌‌‌‌‌ ఇంటర్ కాలేజీల్లో తెలుగుకు పోటీగా సంస్కృతంను సెకండ్ లాంగ్వేజ్‌‌‌‌‌‌‌‌గా పెట్టనున్నట్టు ప్రకటించింది. సీఎం కేసీఆర్ కుతురు, ఎమ్మెల్సీ కవిత రిఫరెన్స్‌‌‌‌‌‌‌‌తోనే ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఇంటర్ బోర్డు వెల్లడించింది. ఈ నిర్ణయాన్ని లెక్చరర్ల సంఘాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి.

కవిత మెప్పుకోసమే..!
రాష్ట్రంలోని అన్ని కాలేజీల్లో ఫస్ట్ లాంగ్వేజ్‌‌‌‌‌‌‌‌గా ఇంగ్లిష్, సెకండ్ లాంగ్వేజ్‌‌‌‌‌‌‌‌గా హిందీ, తెలుగు ఉన్నాయి. కొన్ని ప్రైవేట్‌‌‌‌‌‌‌‌ కాలేజీల్లో హిందీ, తెలుగు, సంస్కృతం ఉన్నాయి. సెకండ్ లాంగ్వేజ్‌‌‌‌‌‌‌‌గా సంస్కృతం తీసుకున్న స్టూడెంట్లకు ఎక్కువ మార్కులు వస్తాయని కొంతకాలంగా కార్పొరేట్‌‌‌‌‌‌‌‌ కాలేజీలు ప్రచారం చేస్తున్నాయి. దీంతో బాగా రాసిన స్టూడెంట్లకు తెలుగులోనూ 99 మార్కులేయడం స్టార్ట్‌‌‌‌‌‌‌‌ చేశారు. ఇక సమస్య తీరిందనే టైమ్‌‌‌‌‌‌‌‌లో గురువారం ఇంటర్ బోర్డు వివాదాస్పద ఉత్తర్వులు ఇచ్చింది. అన్ని సర్కారు, ఎయిడెడ్ జూనియర్ కాలేజీల్లో సంస్కృతం సెకండ్ లాంగ్వేజీగా అమలు చేయాలని బోర్డు సెక్రటరీ జలీల్ ఉత్తర్వులిచ్చారు. రాష్ట్రంలో ఎక్కడా సంస్కృతం పోస్టుల్లేవు. ఎక్కడెక్కడ అవసరమవుతాయో చెప్పాలని డీఐఈవోలను ఆదేశించారు. ఎవరితో చర్చించకుండా ఏకపక్షంగా బోర్డు నిర్ణయం తీసుకోవడంపై లెక్చరర్ల సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. కవిత మెప్పుకోసమే బోర్డు సెక్రటరీ ఈ నిర్ణయం తీసుకున్నారని ఆరోపిస్తున్నాయి.