పంజాగుట్ట ఎస్సై కాలర్ పట్టుకున్న రేణుక చౌదరి

పంజాగుట్ట ఎస్సై కాలర్ పట్టుకున్న రేణుక చౌదరి

టీపీసీసీ పిలుపునిచ్చిన ఛలో రాజ్ భవన్ కార్యక్రమం ఉద్రిక్తంగా మారింది.  కాంగ్రెస్ ర్యాలీని పోలీసులు అడ్డుకోవడంతో ఒక్కసారిగా హైటెన్షన్ నెలకొంది. ఈ క్రమంలో పోలీసులు, రేణుకాచౌదరి మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. ఎందుకు అడ్డుకుంటారంటూ ఆమె పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక తనను అడ్డుకున్న పంజాగుట్ట ఎస్సై కాలర్ పట్టుకుంది. దీంతో పోలీసులు అదుపులోకి తీసుకునేందుకు యత్నించగా ఆమె సీరియస్ అయ్యారు. మర్యాద లేకుండా మహిళపై దౌర్జన్యం ఏంటని ప్రశ్నించారు. జీపు ఎక్కేది లేదంటూ తేల్చిచెప్పగా..పోలీసులు బలవంతంగా జీపులో ఎక్కించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ ను ఎవరు అడ్డుకోలేరని ఆమె వ్యాఖ్యానించింది. 

కాగా ఛలో రాజ్ భవన్ ను పోలీసులు అడ్డుకోవడంతో రోడ్డుపై కాంగ్రెస్ శ్రేణులు స్కూటీకి నిప్పుపెట్టడంతోపాటు బస్సుల అద్దాలను ధ్వంసం చేశారు. అంతేగాకుండా బస్ ఎక్కి ఆందోళన నిర్వహించారు. ఈ నేపథ్యంలో పోలీసులకు కాంగ్రెస్ శ్రేణులకు మధ్య తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఈ నేపథ్యంలో రేవంత్ రెడ్డి, జగ్గారెడ్డి, భట్టి విక్రమార్క సహా పలువురు నేతలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇక రేవంత్ రెడ్డిని స్టేషన్ తరలిస్తుండగా కార్యకర్తలు అడ్డుకోవడంతో తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. పోలీసులు,  కాంగ్రెస్ శ్రేణుల మధ్య తీవ్ర తోపులాట జరిగింది. కాంగ్రెస్ కార్యకర్తలు రాజ్ భవన్ వైపు వెళ్లేందుకు యత్నించడంతో పోలీసులు లాఠీ చార్జ్ చేశారు. కాంగ్రెస్ నిరసనతో భారీగా ట్రాఫిక్ జాం అయింది.