
ఐపీఎల్ 2026 ట్రేడ్ డీల్ ఇప్పటి నుంచే హైప్ పెంచుతోంది. ఇప్పటికే రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ సంజు శాంసన్ చెన్నై సూపర్ కింగ్స్ జట్టులో చేరతాడనే వార్తలు నెల క్రితం ఊపందుకున్నాయి. శాంసన్ పై తమకు ఆసక్తి ఉందని చెన్నై ఫ్రాంఛైజి అధికారికంగా చెప్పిన సంగతి తెలిసిందే. ఈ విషయం పక్కన పెడితే ఇప్పుడు మరో అతి పెద్ద ట్రేడ్ డీల్ వైరల్ గా మారుతోంది. కోల్‌కతా నైట్ రైడర్స్ (కేకేఆర్) ఫ్రాంచైజీ టీమిండియా స్టార్ బ్యాటర్ కేఎల్ రాహుల్ పై కన్నేసినట్టు తెలిసింది. ట్రేడ్ డీల్ ద్వారా కేకేఆర్ జట్టు రాహుల్‌ను కొనుగోలు చేయాలని ఆసక్తిగా ఉందని రిపోర్ట్స్ చెబుతున్నాయి.
2025 సీజన్ లో రాహుల్ ఢిల్లీ క్యాపిటల్స్ తరఫున ఆడాడు. రాహుల్ ను కేకేఆర్ తమ జట్టులోకి తీసుకోవాలని.. ఈ విషయంలో రాహుల్ అభిప్రాయం కోసం ఎదురు చూస్తున్నట్టు సమాచారం. రాహుల్ కోల్‌కతా జట్టులోకి వస్తే రూ. 25 కోట్లు ఇవ్వనున్నట్టు వార్తలు వస్తున్నాయి. కేకేఆర్ వికెట్ కీపర్ బ్యాటర్ కోసం విదేశీ ఆటగాడిపై ఆధారపడుతుంది. ఫామ్ లో ఉన్నా లేకపోయినా వికెట్ కీపర్ కోసం విదేశీ ఆటగాడిని జట్టులోకి తీసుకోవాల్సి వస్తుంది. రాహుల్ కేకేఆర్ జట్టులోకి వస్తే కెప్టెన్సీతో వికెట్ కీపర్ సమస్య తొలగిపోతుంది. అయితే ట్రేడింగ్ లో రాహుల్ ను తీసుకుంటే అతని స్థానంలో కేకేఆర్ ఫ్రాంచైజీ ఢిల్లీ జట్టులో ఎవరినైనా వదులుకోవాలి.
రాహుల్ లాంటి స్టార్ ప్లేయర్ ను ఢిల్లీ ట్రేడింగ్ ద్వారా వదులుకోవాలంటే ఆ రేంజ్ స్టార్ ప్లేయర్ కేకేఆర్ జట్టులో ఎవరూ లేరు. దీంతో కేకేఆర్ ఆసక్తి చూపించినా ఢిల్లీ క్యాపిటల్స్ రాహుల్ ను వదులుకునే అవకాశం లేనట్టు తెలుస్తోంది. రాహుల్ లక్నో సూపర్ జెయింట్స్ తో విడిపోయిన తర్వాత గత సీజన్ కు ముందు జరిగిన మెగా ఆక్షన్ లో ఢిల్లీ క్యాపిటల్స్ రూ.14 కోట్లకు కొనుగోలు చేసింది. 2025 లో అజింక్య రహానే కెప్టెన్సీలోని కేకేఆర్ జట్టు 14 మ్యాచ్‌లలో కేవలం 5 విజయాలతో పాయింట్ల పట్టికలో ఎనిమిదో స్థానంలో నిలిచింది.
🚨 Breaking: Kolkata Knight Riders are keen to acquire KL Rahul for IPL 2026 via trade. 😮💥
— KKR Vibe (@KnightsVibe) July 31, 2025
- Gaurav Gupta, TOI pic.twitter.com/r7j6TPy36K