గాడిదను ఇంటర్వ్యూ చేసిన రిపోర్టర్.. సోషల్ మీడియాలో వైరల్

గాడిదను ఇంటర్వ్యూ చేసిన రిపోర్టర్.. సోషల్ మీడియాలో వైరల్

న్యూఢిల్లీ: కరోనా కేసులు విపరీతంగా పెరుగుతున్నప్పటికీ కొందరు జాగ్రత్తలు పాటించడం లేదు. మీడియా, ప్రభుత్వం ఎంతగా మొత్తుకుంటున్నప్పటికీ వైరస్‌కు అశ్రద్ధ మానడం లేదు. దీంతో మాస్కులు కట్టుకోని వారిపై ఓ జర్నలిస్ట్‌ వీడియో చేశాడు. గాడిదను ఇంటర్వ్యూ చేస్తూ సాగిన ఈ వీడియో మాస్క్‌ కట్టుకోని వారిపై సెటైరిక్‌గా ఉంది. ప్రస్తుతం ఇది నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ప్రజల్లో మాస్కులు కట్టుకోవడం, జాగ్రత్తలు పాటించడంపై అవగాహన కోసం చేసిన ఈ ఇంటర్వ్యూను నెటిజన్స్‌తోపాటు పోలీసు అధికారులు కూడా ప్రశంసిస్తున్నారు.

వీడియోలో భాగంగా రోడ్డు పక్కన ఉన్న ఓ గాడిదను మాస్కు ఎందుకు కట్టుకోలేదని సదరు జర్నలిస్టు ప్రశ్నిస్తాడు. మాస్కు కట్టుకోకుండా రోడ్డుపై ఎందుకు వచ్చావని అడుగుడతాడు. ఆ తర్వాత అక్కడి నుంచి వెళ్తున్న మాస్క్ కట్టుకోని వారిని అదే ప్రశ్న వేస్తాడు. ఆ గాడిద ఎందుకు మాస్క్ కట్టుకోలేదని బాటసారులను ప్రశ్నించగా.. అదో జంతువు కాబట్టే కట్టుకోలేదు అని వారు సమాధానం చెప్తారు. వెంటనే సదరు రిపోర్టర్ వారితో బదులు చెబుతూ.. ‘లాక్‌డౌన్‌లో గాడిద రోడ్లపైకి వస్తుంది. అది కూడా మాస్క్ కట్టుకోకుండానే అని చెప్పడం నవ్వు తెప్పిస్తోంది. ఇదే ప్రశ్నను మాస్క్ కట్టుకోకుండా వెళ్తున్న పలువురిని ఆపి ప్రశ్నించడం వ్యంగ్యంగా సాగింది. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతోంది. ఐపీఎస్ ఆఫీసర్ అరున్ బోత్రా ఈ వీడియోను ట్విట్టర్‌‌లో షేర్ చేశారు.