కేసీఆర్ కు ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ లేఖ

కేసీఆర్ కు ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ లేఖ

హైదరాబాద్: పంజాబ్ తరహాలో అవినీతిని కట్టడి చేయాలని  ఫోరమ్ పర్ గుడ్ గవర్నెన్స్ ప్రతినిధులు రిటైర్డ్ జస్టిస్ రెడ్డప్ప రెడ్డి, పద్మనాభ రెడ్డి, కృష్ణారెడ్డి సీఎం కేసీఆర్ కు లేఖ రాశారు. ఇటీవల ఢిల్లీ వెళ్లిన సీఎం కేసీఆర్... ప్రభుత్వ పాఠశాలలు, ఆసుపత్రుల గురించి అక్కడి ఆప్ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను కేసీఆర్ పొగిడారని లేఖలో గుర్తు చేశారు. ఆప్ పాలన దేశానికి ఆదర్శమని కేసీఆర్ ప్రశంసించారని వారు తెలిపారు. అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న మంత్రిని పంజాబ్ లోని ఆప్ ప్రభుత్వం తొలగించిందని... మరీ కేసీఆర్ ప్రభుత్వంలోని అవినీతి మంత్రులు, ఎమ్మెల్యేలపై చర్యలు ఎందుకు తీసుకోవడం లేదని ప్రశ్నించారు.

పంజాబ్ మంత్రి అవినీతి గురించి ఏ మీడియా సంస్థలో రాకముందే అక్కడి సీఎం భగవంత్ మాన్ మంత్రిని తొలగించడం గొప్ప విషమన్న వారు... కేసీఆర్ ప్రభుత్వంలోని అవినీతి పరుల గురించి ఎన్ని సార్లు ఫిర్యాదు చేసిన పట్టించుకోవడం లేదని ఆరోపించారు. ప్రభుత్వ పనుల్లో కమీషన్ల పేరుతో పెద్ద ఎత్తున అవినీతి జరుగుతున్న కేసీఆర్ పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. ఆప్ ప్రభుత్వం చేపడుతున్న జీరో టాలరెన్స్ ఫర్ కరప్షన్ ను రాష్ట్రంలో కూడా అమలు చేయాలని వారు డిమాండ్ చేశారు. అవినీతిపై ఉక్కుపాదం మోపి... సుపరిపాలన అందించాలని కేసీఆర్ ను డిమాండ్ చేశారు. 

మరిన్ని వార్తల కోసం...

యాసిన్ మాలిక్ కేసులో తీర్పుపై ఉత్కంఠ

ఫ్యామిలీ అంతా కలిసి చూసే సినిమా ‘ఎఫ్ 3’