ఎస్సీకి రామగుండం.. బీసీకి కరీంనగర్

ఎస్సీకి రామగుండం..  బీసీకి కరీంనగర్
  • ఉమ్మడి జిల్లాలోని అర్బన్ ​లోకల్​ బాడీలకు రిజర్వేషన్లు ఖరారు
  • 2 కార్పొరేషన్​,13 మున్సిపల్​ చైర్​పర్సన్లలో జనరల్​కు 6, బీసీలకు 5, ఎస్సీలకు 4 కేటాయింపు     

జగిత్యాల, వెలుగు: ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని కరీంనగర్​, రామగుండం కార్పొరేషన్ల మేయర్లతో పాటు 13 మున్సిపాలిటీల్లో చైర్​పర్సన్​ పదవులకు రిజర్వేషన్లు ఖరారయ్యాయి. ఈ మేరకు ఆయా జిల్లాల కలెక్టర్లు శనివారం అధికారికంగా ప్రకటించారు. తెలంగాణ మున్సిపాలిటీస్  యాక్ట్-–2019లోని సెక్షన్-–7 ప్రకారం గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేశారు. రెండు మేయర్​,13 మున్సిపల్​ చైర్​పర్సన్లలో జనరల్​కు 6, బీసీలకు 5, ఎస్సీలకు 4 దక్కాయి.

గతంలో జనరల్ గా ఉన్న కరీంనగర్​ మేయర్​ పీఠం ఈసారి బీసీకి, గతంలో ఎస్సీ జనరల్​గా ఉన్న  రామగుండం ఈసారి ఎస్సీకే దక్కడం విశేషం. రొటేషన్​లో మారాల్సి ఉన్నప్పటికీ చుట్టపక్కల గ్రామాలు కలవడంతో   రామగుండంను కొత్త కార్పొరేషన్​గా తీసుకున్నామని అధికారులు చెప్తున్నారు. 

మున్సిపాలిటీల్లోనూ మార్పులు.. 

గతంలో జనరల్​ మహిళగా ఉన్న చొప్పదండి, హుజూరాబాద్​ ఎస్సీ మహిళకు, గతంలో జనరల్​గా ఉన్న జమ్మికుంట ఎస్సీ జనరల్​కు, జనరల్​ మహిళగా ఉన్న వేములవాడ బీసీ జనరల్​ కు, బీసీ మహిళగా ఉన్న సిరిసిల్ల జనరల్​ మహిళకు దక్కాయి. గతంలో బీసీ మహిళగా ఉన్న జగిత్యాల ఈసారి కూడా బీసీ మహిళకే దక్కింది.  బీసీ మహిళగా ఉన్న కోరుట్ల ఈసారి జనరల్ ​మహిళ, బీసీ మహిళగా ఉన్న మెట్​పల్లి ఈసారి జనరల్​, బీసీ జనరల్​గా ఉన్న రాయికల్​ఈసారి జనరల్​, బీసీ జనరల్​గా ఉన్న ధర్మపురి ఈసారి జనరల్​మహిళకు దక్కాయి.

ఇక గతంలో జనరల్​ మహిళగా ఉన్న పెద్దపల్లి, బీసీ జనరల్​కు కేటాయించగా, బీసీ​మహిళగా ఉన్న మంథని ప్రస్తుతం బీసీ జనరల్​కు దక్కాయి. గతంలో బీసీ జనరల్​కు కేటాయించిన సుల్తానాబాద్​ ప్రస్తుతం జనరల్​కు కేటాయించడం విశేషం. మొత్తం మీద ఉమ్మడి కరీంనగర్​ జిల్లాలోని మొత్తం 15 అర్బన్​ లోకల్​బాడీల్లో మహిళలకు ఆరు దక్కడం విశేషం.

ఉమ్మడి జిల్లాలో రిజర్వేషన్ల వివరాలు

మున్సిపాలిటీ/    చైర్మన్ పదవి

కార్పొరేషన్    

జగిత్యాల        బీసీ మహిళ

కోరుట్ల        జనరల్ మహిళ

మెట్‌పల్లి        జనరల్

రాయికల్        జనరల్

ధర్మపురి        జనరల్ మహిళ

కరీంనగర్        బీసీ జనరల్

హుజూరాబాద్    ఎస్సీ మహిళ

జమ్మికుంట        ఎస్సీ జనరల్

చొప్పదండి        ఎస్సీ మహిళ

సిరిసిల్ల        జనరల్ మహిళ

వేములవాడ        బీసీ జనరల్

రామగుండం    ఎస్సీ జనరల్

పెద్దపల్లి        బీసీ జనరల్

మంథని        బీసీ జనరల్

సుల్తానాబాద్    జనరల్