ప్రైవేట్ కంపెనీలో స్థానికులకు రిజర్వేషన్ ఇవ్వాలి

ప్రైవేట్ కంపెనీలో స్థానికులకు రిజర్వేషన్ ఇవ్వాలి
  • మాజీ మంత్రి, బీజేపీ నేత ఈటల రాజేందర్

పెద్దపల్లి జిల్లా:  ప్రైవేట్ కంపెనీలో స్థానికులకు రిజర్వేషన్ ఇవ్వాలని మాజీ మంత్రి, బీజేపీ నేత ఈటల రాజేందర్ డిమాండ్ చేశారు. తెలంగాణ ఉద్యమ టాగ్ లైన్ నీళ్ళు, నిధులు, నియామకాలు.. కానీ నియామకాలు ఎక్కడ చేపట్టడం లేదు, సాగర్ ఎన్నికలు, ఎమ్మెల్సీ ఎన్నికలు, హుజురాబాద్ ఎన్నికలు వచ్చినప్పుడు టీఆర్ఎస్ ప్రభుత్వం కు ఉద్యోగాల ప్రస్తావన తెస్తుంది. తరువాత వాటి గురించి పట్టించుకోలేదన్నారు. రిచేస్ట్ స్టేట్ అంటారు మానిఫెస్టో లో పెట్టిన నిరుద్యోగ భృతి ఇవ్వరని విమర్శించారు. బీజేపీ సీనియర్ నాయకులు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దుగ్యాల ప్రదీప్ రావు ని పరామర్శించిన అనంతరం ఈటల రాజేందర్ మీడియా సమావేశం నిర్వహించారు.  
సీఎం కేసిఆర్ మాటలు చెప్పి కాలం గడుపుతున్నారని ఆయన ఆరోపించారు. వెంటనే పీఆర్సీ కమిటీ చెప్పినట్టు 1.9 లక్షల ఉద్యోగ నియామకాలు చేపట్టాలన్నారు. అలాగే ప్రైవేట్ కంపెనీలో స్థానికులకు రిజర్వేషన్ ఇవ్వాలన్నారు. అనేకమంది విదేశాలకు వెళ్తున్నారు. వారికోసం 500 కోట్లు కేటాయిస్తానని చెప్పారని గుర్తు చేస్తూ వాటిని విడుదల చేయాలని డిమాండ్ చేశారు. బానిసలు కెసిఆర్ దగ్గర ఉన్నారు, ప్రజలకోసం తపించే వారు అందరూ బయటికి వచ్చేశారు, కేసీఆర్ ఇప్పటికైనా ఎదురుదాడి పక్కన పెట్టి, ఫాం హౌస్, ప్రగతి భవన్ వదిలి పెట్టి ప్రజల మధ్యకు రావాలని డిమాండ్ చేశారు.