ముష్కిన్ చెరువును కాపాడారు.. థాంక్యూ సర్:హైడ్రా చీఫ్‏ను సత్కరించిన నార్సింగ్ వాసులు

ముష్కిన్ చెరువును కాపాడారు.. థాంక్యూ సర్:హైడ్రా చీఫ్‏ను సత్కరించిన నార్సింగ్ వాసులు

హైదరాబాద్ సిటీ, వెలుగు: రంగారెడ్డి జిల్లా గండిపేట మండలం నార్సింగ్ విలేజ్‎లోని ముష్కిన్ చెరువును కాపాడిన హైడ్రాకు గ్రామస్తులు కృతజ్ఞతలు తెలిపారు. శనివారం హైడ్రా కార్యాలయానికి వెళ్లి కమిషనర్ రంగనాథ్ ను సత్కరించారు. కబ్జాల పాలవుతున్న చెరువును కాపాడి సకల జీవకోటికి ప్రాణం పోశారని తెలిపారు.

 52.20 ఎకరాల పరిధిలో ఉన్న చెరువులో 35.10 ఎకరాలు కబ్జా చేస్తే హైడ్రా రక్షించిందన్నారు. ఈ చెరువును అభివృద్ధి చేసి, పర్యావరణ పరిరక్షణ చర్యలు చేపట్టాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం ముందు చూపుతో హైడ్రాను ఏర్పాటు చేసి, భవిష్యత్ తరాలకు చెరువులను వరంగా ఇవ్వాలని చూడటం అభినందనీయమని పేర్కొన్నారు.