
కరోనా సెకండ్ వేవ్ వల్ల ఆగిపోయిన సినిమా షూటింగ్స్ ఒక్కొక్కటిగా మొదలవుతున్నాయి. ప్రభుత్వం లాక్‌డౌన్ ఆంక్షల్ని మెల్లగా సడలిస్తుండడంతో చిన్న సినిమాలు మొదలు పెద్ద సినిమాల వరకు తిరిగి సెట్స్‌కి వెళ్లడానికి రెడీ అవుతున్నాయి. ఇప్పటికే నితిన్ సినిమా మొదలైంది. ఎన్టీఆర్, రామ్ చరణ్ హీరోలుగా రాజమౌళి తెరకెక్కిస్తున్న ‘ఆర్ఆర్ఆర్’ చిత్రం షూటింగ్ కూడా త్వరలో స్టార్ట్ కాబోతోంది. ఇప్పటికే కరోనాతో రెండుసార్లు ఈ మూవీ షూటింగ్‌కి బ్రేక్ పడింది. దీంతో ఇక ఆలస్యం చేయకుండా షూట్‌ను రీస్టార్ట్ చేసేందుకు రాజమౌళి టీమ్ సన్నాహాలు చేస్తోంది. జులై 1 నుండి నెక్స్ట్ షెడ్యూల్ స్టార్ట్ చేయబోతున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే డెబ్భై శాతానికి పైగా కంప్లీట్ చేశారు. ఇప్పుడు మిగతాది తీయాల్సి ఉంది. దసరా సందర్భంగా అక్టోబర్‌లో రిలీజ్ అని గతంలో ప్రకటించారు. అయితే షూటింగ్‌కి బ్రేక్ పడింది కనుక రిలీజ్ డేట్ కూడా మారే అవకాశాలున్నాయి. షూటింగ్, పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తి కావడానికి దాదాపు ఆరు నెలల సమయం పట్టొచ్చు. దీంతో వచ్చే యేడాది సమ్మర్‌లో రిలీజ్ చేస్తారని ఇండస్ట్రీ టాక్. కొమురం భీమ్‌గా ఎన్టీఆర్, అల్లూరి సీతారామరాజుగా రామ్ చరణ్ నటిస్తున్న ఈ చిత్రంలో అజయ్ దేవగన్, ఆలియా భట్, ఒలీవియా మోరిస్, సముద్రఖని, శ్రియ, రే స్టీవెన్ సన్, అలీసన్ డూడీ ఇతర ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. డీవీవీ దానయ్య నిర్మిస్తున్నారు.