ఆరు పరీక్షల ఫలితాలు రిలీజ్​

ఆరు పరీక్షల ఫలితాలు రిలీజ్​

 టీపీఏ, ఏఎంవీఐ, డ్రగ్ ఇన్​స్పెక్టర్, హార్టికల్చర్ ఆఫీసర్, లైబ్రేరియన్, ఏఓ రిజల్ట్స్ ఇచ్చిన టీఎస్​పీఎస్సీ

హైదరాబాద్, వెలుగు: గతంలో నిర్వహించిన ఆరు పరీక్షల ఫలితాలను టీఎస్​పీఎస్సీ శుక్రవారం రాత్రి రిలీజ్ చేసింది. టౌన్ ప్లానింగ్ ఆఫీసర్, డ్రగ్ ఇన్​స్పెక్టర్, హార్టికల్చర్ ఆఫీసర్, లైబ్రేరియన్స్, అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్​స్పెక్టర్, అగ్రికల్చర్ ఆఫీసర్ తదితర పోస్టులకు సంబంధించిన జీఆర్ఎల్ లిస్టులు https://www.tspsc.gov.in  వెబ్ సైట్​లో పెట్టారు. 

స్టేట్​లో 175 టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ పోస్టుల భర్తీ కోసం గతేడాది జులై 8న పరీక్ష నిర్వహించారు. ఈ ఫలితాల్లో ఏడో జోన్​కు చెందిన ఓ అభ్యర్థికి 300 మార్కులకు గాను 254.032 మార్కులు సాధించి టాపర్​గా నిలిచారు. 2,499 మందికి 200లకు పైగా మార్కులు వచ్చాయి. రాష్ట్రంలో 113 ఏఎంవీఐ పోస్టుల భర్తీకి గతేడాది జూన్ 28 పరీక్ష జరిగింది. దీంట్లో 450 మార్కులకు గాను 374.873 మార్కులతో మల్టీజోన్ 2కు చెందిన ఓ అభ్యర్థి టాపర్​గా నిలిచారు. నిరుడు మే 19న 18 డ్రగ్ ఇన్​స్పెక్టర్ పోస్టుల భర్తీకి జరిగిన పరీక్షలో 450 మార్కులకు గాను 347.820 మార్కులతో మల్టీజోన్1కు చెందిన అభ్యర్థి టాపర్ గా నిలిచారు.

 మే 17న జరిగిన 71 లైబ్రరియన్ పోస్టుల భర్తీ  ఎగ్జామ్‌లో 450 మార్కులకు 294.932 మార్కులతో జోన్4 అభ్యర్థి టాపర్ గా నిలిచారు. 22 హార్టికల్చర్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి జూన్ 22న పరీక్ష జరగ్గా, 318.966 మార్కులతో మల్టీజోన్ 1కు చెందిన అభ్యర్థి టాపర్​గా నిలిచారు. త్వరలోనే సర్టిఫికెట్ల వెరిఫికేషన్ కోసం షార్ట్ లిస్టు రిలీజ్ చేస్తామని వెల్లడించారు.