బాలుడిని కుక్కలు చంపినయ్ కేటీఆర్ ఇదేం సర్కార్

బాలుడిని కుక్కలు చంపినయ్ కేటీఆర్ ఇదేం సర్కార్

కుక్క కరిచి బాలుడు చనిపోతే.. ఆ కుటుంబానికి నష్ట పరిహారం ఇవ్వకుండా ప్రభుత్వం కేవలం సారీ చెప్పి చేతులు దులుపుకుందని పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఆరోపించారు. కనీస సానుభూతి చూపని రాక్షస ప్రభుత్వం ఇది అని ఆగ్రహం వ్యక్తం చేశారు. మున్సిపల్ శాఖ మంత్రిగా కేటీఆర్ పూర్తిగా విఫలమయ్యారన్న రేవంత్.. నిన్న ఐదేళ్ల చిన్నారిని కుక్కలు కరిచి చంపేస్తే ప్రభుత్వం మానవత్వం లేకుండా ప్రభుత్వం వ్యవహరిస్తోందని విమర్శించారు. కుక్కలకు ఆకలేసిందని హైదరాబాద్ మేయర్  మాట్లాడుతున్నారని చెప్పారు. వీధి కుక్కలు మనుషులను పీక్కు తినే పరిస్థితి ఈ ప్రభుత్వంలో ఉందని మండిపడ్డారు. కుక్కలు కరిచి మనుషులు చనిపోతే.. కుక్కలకు కుటుంబ నియంత్రణ చేస్తామని మంత్రి చెబుతున్నారని కామెంట్ చేశారు. మంత్రి కేటీఆర్ భూపాలపల్లి పర్యటనకుముందే ఆ కుటుంబాన్ని ఆదుకోవాలని డిమాండ్ చేశారు.

 ఎమ్మెల్యే భూముల ఆక్రమణలపై విచారణకు కేటీఆర్  సిద్ధమా? అని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. కేటీఆర్ కు అందులో వాటాలు లేకుంటే, విచారణకు అదేశించాలని కోరారు. నిరూపించడానికి తమ నాయకులు సిద్ధంగా ఉన్నారన్న రేవంత్.. వరంగల్ జిల్లాను బీఆర్ఎస్ గూండాలు ఆక్రమించుకున్నారని ఆరోపించారు. పార్టీ ఫిరాయించిన డర్టీ డజన్ ఎమ్మెల్యేలను వదిలిపెట్టేది లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంట్రాక్టుల కోసం పార్టీ మారి ఎమ్మెల్యే వెంకట రమణా రెడ్డి దివాలకోరు రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు.