
శ్రీశైలం విద్యుత్ కేంద్రంలో జరిగింది ప్రమాదమా లేక కుట్రనా అని ప్రశ్నించారు కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి. జగన్ జల దోపిడీకి కేసీఆర్ సహకరించి విద్యుత్ ప్రాజెక్టులను చంపేసే కుట్ర జరుగుతోందని తాము ముందే చెప్పామన్నారు. జరిగిన పరిణామం చూస్తుంటే పలు అనుమానాలకు తావిస్తుందన్నారు. కుట్రను ప్రమాదం పేరుతో కప్పిపెట్టే ప్రయత్నం జరుగుతుందన్నారు. నిజానిజాలు తెలియాలంటే ప్రమాదంపై సీబీఐతో విచారణ జరిపించాలన్నారు రేవంత్.
నిన్న రాత్రి పవర్ ప్లాంట్ లో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో సిబ్బంది బయటకు పరుగులు తీశారు. కొందరు అందులోనే చిక్కుకుపోయారు. వారిని బయటకు తీసేందుకు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.
see more news