బహదూర్గూడలో గంగుల, ఎర్రబెల్లి, సుధీర్రెడ్డి భూబాగోతం 

బహదూర్గూడలో గంగుల, ఎర్రబెల్లి, సుధీర్రెడ్డి భూబాగోతం 

శంషాబాద్‌‌ మండలం బహదూర్‌‌గూడలోని రూ. వేల కోట్ల విలువైన 650 ఎకరాల ప్రభుత్వ భూమిని బీఆర్‌‌ఎస్‌‌ నేతలు కొల్లగొట్టేందుకు వ్యూహం పన్నారని సీఎం రేవంత్‌‌రెడ్డి వెల్లడించారు.‘‘బహదూర్‌‌గూడలోని సర్వే నంబర్‌‌ 28లో 150 ఎకరాలు, సర్వే నంబర్‌‌ 62లో 500 ఎకరాలు కలిపి మొత్తం 650 ఎకరాల భూమి ఉంది. 1954–55 కాస్రా పహాణీ నుంచి చెస్సాలా పహాణీ వరకు రెవెన్యూ రికార్డులన్నింటిలోనూ ఇది స్పష్టంగా సర్కారు భూమిగానే నమోదై ఉంది. అలాంటి రూ.వేల కోట్ల విలువైన ప్రభుత్వ భూమిని మాజీ మంత్రులు గంగుల కమలాకర్, ఎర్రబెల్లి దయాకర్‌‌రావు, ఎల్బీనగర్‌‌ ఎమ్మెల్యే తీగల సుధీర్‌‌రెడ్డి తదితరులు కలిసి కొనుగోలు చేశారో, మధ్యవర్తులుగా దళారీతనం చేశారో గానీ.. గతంలో అధికారంలో ఉన్న ఒక మంత్రి అండతో దొంగ డాక్యుమెంట్లు, నకిలీ కాగితాలు సృష్టించి తమ గుప్పిట్లోకి తీసుకున్నారు. ఆ 650 ఎకరాల సర్కారు భూమిని చెరబట్టేందుకు వీరు చేసిన లావాదేవీల (ట్రాన్సాక్షన్స్‌‌) రికార్డులన్నీ నా దగ్గర భద్రంగా ఉన్నాయి. నేను చెప్పేది తప్పని వీరు ఖండించగలరా? ఇంత పచ్చిగా ప్రభుత్వ భూములను కాజేసి, నేడు ఏమీ తెలియనట్టు నటిస్తున్నారు’’ అని ఫైర్‌‌‌‌ అయ్యారు.