అందరి అంగీకారంతోనే నేతల్ని చేర్చుకుంటాం.. రేవంత్​ రెడ్డి

అందరి అంగీకారంతోనే నేతల్ని చేర్చుకుంటాం.. రేవంత్​ రెడ్డి

కాంగ్రెస్​ పార్టీలోకి రావడానికి చాలా మంది చూస్తున్నారని.. ఎవరు వచ్చినా పార్టీలో సీనియర్ల నుంచి కింది స్థాయి నేతల వరకు అభిప్రాయాలు తీసుకునే చేర్చుకుంటామని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్​రెడ్డి స్పష్టం చేశారు. జూన్​ 21న ఆయన ఎంపీ కోమటి రెడ్డి వెంకట్​రెడ్డి నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా పార్టీలో చేరికల అంశం చర్చకు వచ్చింది.

ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్​రెడ్డి చేరికకు పలువురు కాంగ్రెస్​ నేతలు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్న వేళ.. అలాంటిదేమీ లేదని రేవంత్​చెప్పారు. నేతలెవరు చేరినా కాంగ్రెస్​లో అందరి అభిప్రాయాలు తీసుకునే చేర్చుకుంటామన్నారు. కోమటి రెడ్డి వెంకట్​రెడ్డి, ఉత్తమ్​కుమార్​రెడ్డి, జానారెడ్డి ఇలా పొంగులేటి చేరిక విషయంలో అందరి అభిప్రాయం తీసుకున్నామన్నారు. నేతల భేటీ అనంతరం జూపల్లి కృష్ణారావు ఇంటికి నేతలు బయల్దేరారు. మరి కాసేపట్లో జూపల్లితో భేటీ జరగనుంది. 

బీఆర్​ఎస్​ భూస్థాపితం అవుతుంది..:  జూపల్లి

సీఎం కేసీఆర్​ పాలనపై రాష్ట్ర ప్రజలు విసిగిపోయారని మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు విమర్శించారు. జూపల్లి నివాసంలో ఆయన మాట్లాడుతూ.. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్​ఎస్​ పార్టీ భూస్థాపితం అవుతుందని ఘాటు వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్​ పాలన చాలని ప్రజలు అనుకుంటున్నారని తెలిపారు.