చర్లపల్లి జైల్లో కేసీఆర్​కు డబల్​ బెడ్రూం ఇల్లు కట్టిస్తా.. : రేవంత్​రెడ్డి

చర్లపల్లి జైల్లో కేసీఆర్​కు డబల్​ బెడ్రూం ఇల్లు కట్టిస్తా.. : రేవంత్​రెడ్డి

కాంగ్రెస్​ పార్టీ అధికారంలోకి రాగానే రూ.లక్షల కోట్ల అవినీతి చేసిన సీఎం కేసీఆర్ కు చర్లపల్లి జైల్లో డబల్​బెడ్రూం ఇళ్లు కట్టిస్తామని టీపీసీసీ రేవంత్​రెడ్డి అన్నారు. సికింద్రాబాద్​ డీసీసీ అధ్యక్షుడిగా అనిల్​కుమార్​యాదవ్​ప్రమాణ స్వీకారం చేయడగా ఈ కార్యక్రమానికి రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అనంతరం ఏర్పాటు చేసిన పబ్లిక్​ మీటింగ్లో ఆయన మాట్లాడుతూ..  రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్​ పార్టీ బీఆర్​ఎస్​ని చిత్తుగా ఓడిస్తుందని ధీమా వ్యక్తం చేశారు.

డిసెంబర్​లో ఏఐసీసీ మాజీ అధ్యక్షురాలు, కాంగ్రెస్​ సీనియర్​నేత సోనియా గాంధీ పుట్టిన రోజు ఉన్నందున ఆమెకు కానుకగా తెలంగాణలో కాంగ్రెస్​ని గెలిపించి గిఫ్ట్​గా ఇవ్వాలని ప్రజలను కోరారు. సీఎం కేసీఆర్​లేకపోతే తెలంగాణ ఉద్యమం పుట్టకపోయి ఉండేదన్న కేటీఆర్​వ్యాఖ్యలకు రేవంత్​రెడ్డి కౌంటర్​ఇచ్చారు. మంత్రి కేటీఆర్​కి చరిత్ర తెలియదని, కేంద్రంలో అధికారం కోల్పోయినా, ఏపీలో చీకటిలో కలిసిన తెలంగాణ ప్రజల ఆకాంక్షల కోసం సోనియాగాంధీ రాష్ర్టాన్ని ఇచ్చారని పేర్కొన్నారు. డబల్​బెడ్రూం ఇళ్లు ఇచ్చిన ప్రాంతాల్లో బీఆర్​ఎస్​ ఓట్లడగాలని, ఇందిరమ్మ ఇళ్లు కట్టించిన ప్రాంతాల్లో కాంగ్రెస్​ ఓట్లడుగుతుందని అన్నారు.