సీఎం కేసీఆర్ దక్షిణ భారత్ హిట్లర్ గా మారారు:మాణిక్కం ఠాగూర్

సీఎం కేసీఆర్ దక్షిణ భారత్ హిట్లర్ గా మారారు:మాణిక్కం ఠాగూర్

కాంగ్రెస్ సోషల్ మీడియా వింగ్ ఆఫీస్ లో హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు దాడిని నిరసిస్తూ రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలకు PCC చీఫ్ రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. అన్ని మండల కేంద్రాల్లో నిరసనలు నిర్వహించాలన్నారు. సీఎం కేసీఆర్ దిష్టిబొమ్మలు దహనం చేయాలని సూచించారు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెస్ నేతలను ముందస్తు అరెస్ట్ చేస్తున్నారు పోలీసులు. హైదరాబాద్ లో కాంగ్రెస్ సీనియర్ నేతలు షబ్బీర్ అలీ, మల్లు రవిని హౌస్ అరెస్ట్ చేశారు. యూత్ కాంగ్రెస్ నాయకుడు అనీల్ యాదవ్ ను అరెస్ట్ చేసి, పోలీసు స్టేషన్ కు తరలించారు. అరెస్టులపై మండిపడుతున్నారు కాంగ్రెస్ నేతలు. 

మరోవైపు సోషల్ మీడియా వింగ్ ఆఫీస్ పై పోలీసులు దాడి చేయడం చట్టవిరుద్ధమని ట్వీట్ చేశారు రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జి మాణిక్కం ఠాగూర్. ఈ ఘటనపై లోక్ సభలో వాయిదా తీర్మానం ఇచ్చారు. తెలంగాణ సీఎం దక్షిణ భారత హిట్లర్ లాగా మారారని ఆరోపించారు. 

మరోవైపు హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ ఆఫీస్ ముట్టడికి సిటీ కాంగ్రెస్ నేతలు పిలుపు ఇచ్చారు. దీంతో కమాండ్ కంట్రోల్ సెంట్రల్ లోని సీపీ ఆఫీస్ దగ్గర భారీగా మోహరించారు పోలీసులు. కంట్రోల్ సెంటర్ కు వచ్చే రోడ్లను మూసివేశారు.