- ప్రభుత్వ వాహనాలు క్రమంగా ఈవీ వైపు!
- తన కాన్వాయ్ సహా అన్ని డిపార్ట్‌మెంట్స్‌కు ఎలక్ట్రిక్
- వాహనాలే కొనాలని సీఎం ఆదేశాలు
- వివిధ డిపార్ట్మెంట్లలో లక్ష దాకా ఫోర్ వీలర్స్
హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర ప్రభుత్వ అవసరాల కోసం ఇకపై ఎలక్ట్రికల్వెహికిల్స్(ఈవీ) మాత్రమే కొనాలని రాష్ట్ర సర్కారు నిర్ణయించింది. ఇప్పటికే ఉన్న డీజిల్, పెట్రోల్వెహికల్స్ను వినిగిస్తూనే కొత్తగా అవసరమైన చోట ఈవీలు కొనాలని, తన కాన్వాయ్సహా అన్ని డిపార్ట్మెంట్లకూ ఇది వర్తిస్తుందని సీఎం రేవంత్ రెడ్డి ఇటీవల ఆదేశాలు జారీ చేశారు.
ప్రభుత్వ అధికారులు ఉపయోగించే అద్దె వాహనాలు సైతం ఎలక్ట్రిక్‌వే ఉండాలని స్పష్టం చేశారు. ఇరాన్, ఇజ్రాయెల్యుద్ధంతో పెట్రోల్, గ్యాస్ సరఫరాకు తీవ్ర ఆటంకాలు ఎదురవుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సీఎం నిర్ణయం ప్రాధాన్యత సంతరించుకున్నది. కాగా, సరిపడా చార్జింగ్ స్టేషన్లు లేకపోవడమే ఈవీ వెహికల్స్‌కు సమస్యగా మారింది. రాష్ట్రంలో ప్రస్తుతం 1,062 ఈవీ చార్జింగ్ స్టేషన్లు ఉండగా.. మరో 1,500 ఈవీ చార్జింగ్ స్టేషన్లకు సంబంధించిన అప్లికేషన్లు రెడ్కో దగ్గరే పెండింగ్ఉన్నాయి.
ప్రభుత్వ వినియోగంలో లక్ష దాకా ఫోర్‌వీలర్స్ రాష్ట్ర ప్రభుత్వం వివిధ శాఖల పరిధిలో సుమారు 50 వేలకు పైగా ఫోర్‌వీలర్స్ వినియోగిస్తోంది. ప్రభుత్వ అధికారులు ఉపయోగించే అద్దె వాహనాలు మరో 50 వేలకు పైగా ఉంటాయి. సీఎం రేవంత్ ఆదేశాల ప్రకారం వీటన్నింటినీ భవిష్యత్‌లో ఈవీ వెహికల్స్‌గా మారిస్తే మెయింటనెన్స్ తగ్గడంతో పాటు ప్రభుత్వానికి డీజిల్, పెట్రోల్ఆదా రూపంలో వందల కోట్లు కలిసివస్తాయని భావిస్తున్నారు. మరోవైపు రాష్ట్రంలోనూ ఈవీ వెహికల్స్ క్రమంగా పెరుగుతున్నాయి.
2024తో పోల్చితే 2025 క్యాలెండర్ ఇయర్లో ఈవీ ఫోర్ వీలర్స్ సంఖ్య గణనీయంగా పెరిగింది. ప్రభుత్వ రికార్డుల ప్రకారం 2024లో ఈవీ కార్లు 1,943 ఉండగా.. 2025 జనవరి నుంచి డిసెంబర్ 31 వరకు కొత్తగా 19,965 ఈవీ కార్లు రిజిష్టర్ అయినట్టు రికార్డులు చెబుతున్నాయి. ప్రభుత్వం ఈవీ వెహికల్స్‌కు రోడ్ ట్యాక్స్, రిజిస్ట్రేషన్ ఫీజులో వంద శాతం రాయితీ ఇవ్వడంతో ఒక ఏడాదిలోనే ఈవీ వెహికల్స్ పదిరెట్ల పెరిగాయి.
కాగా, పెరుగుతున్న ఈవీ వెహికల్స్ అవసరాలకు తగ్గట్టుగా రాష్ట్రంలో ఈవీ చార్జింగ్ స్టేషన్లు లేవు. ఇప్పటివరకు రాష్ట్రంలో మొత్తం 1,062 ఈవీ చార్జింగ్ స్టేషన్లను ఏర్పాటు చేయగా, ప్రభుత్వ పరిధిలో 150 ఉండగా, మిగిలినవన్నీ ప్రైవేట్ఆధ్వర్యంలో నడుస్తున్నాం. 2030 నాటికి 6 వేలకు, 2035 నాటికి 12 వేల వరకు ఈవీ స్టేషన్లు పెంచాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్నది. నేషనల్ హైవే రోడ్లపై ప్రతి 25, -30 కిలోమీటర్లకు ఒకటి చొప్పున ఈవీ చార్జింగ్ స్టేషన్లను ఏర్పాటు చేయాలని భావిస్తోంది.
