
ఓఆర్ఆర్ (ఔటర్ రింగ్ రోడ్) లీజు స్కాం వెనుక మంత్రి కేటీఆర్ ఉన్నారని టీ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఆరోపించారు. మూడు నెలల్లో దిగిపోయేవా సీఎం కేసీఆర్ కు ముప్పై ఏళ్ల లీజు ఎలా ఇస్తారని ప్రశ్నించారు. ఓఆర్ఆర్ ఆస్తులను కేసీఆర్ నిలువున అమ్మేస్తున్నారని ఆరోపించారు.
టెండర్లు లేకుండానే నాలుగు సంవత్సరాలుగా ఒకే సంస్థకు తక్కువ ఔటర్ రింగ్ రోడ్డు లీజుకిచ్చారని ఆరోపించారు రేవంత్. ఓఆర్ఆర్ దోపిడి వెనుక ఉన్న కేటీఆర్, ఆయన భాగస్వాములైన సంస్థ యజమానులను వదలబోమన్నారు. తాము అధికారంలోకి రాగానే ఒక్కొక్కన్ని బొక్కలో వేస్తామన్నారు రేవంత్. కేటీఆర్ ను బొక్కలో వేసే వరకు కాంగ్రెస్ పోరాటం చేస్తుందన్నారు.
తాను 20 ఏళ్ల నుంచి ప్రజాప్రతినిధిగా ఉన్నానని.. ఏనాడు సచివాలయానికి వెళ్తే ఆపలేదన్నారు రేవంత్. ఒక ఎంపీని సెక్రటేరియట్ కు కిలో మీటరు దూరంలో ఆపేస్తారా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎంకు, మంత్రులకు ఎమ్మెల్యేలకు అందరికీ ఒకే రకమైన హక్కులు ఉన్నాయన్నారు. పరిపాలనభవనంలోకి ప్రవేశించేందుకు పర్మిషన్ ఎందుకని ప్రశ్నించారు. తెలంగాణలో అంబేద్కర్ రాజ్యాంగం నడవట్లేదన్నారు. కేసీఆర్ పోలీసులతో పాలన చేస్తుండని..తప్పకుండా ప్రజలు తిరగడబడ్తరని కేసీఆర్ ను బొంద పెడ్తరని అన్నారు.
అంతకుముందు ఓఆర్ఆర్ వ్యవహారంపై ఫిర్యాదు చేసేందుకు సెక్రటేరియట్ వెళ్తుండగా టెలిఫోన్ భవన్ దగ్గర రేవంత్ రెడ్డిని పోలీసులు అడ్డుకున్నారు. సెక్రటేరియట్ విజిటర్స్ గేట్లు మూసివేసిన పోలీసులు సెక్రటేరియట్ గేట్ల దగ్గర భారీకేడ్లు పెట్టారు. ఔటర్ రింగ్ రోడ్డు టెండర్లపై ప్రిన్సిపల్ సెక్రటరీకి ఫిర్యాదు చేయడానికి వెళ్తున్నట్లు రేవంత్ చెప్పాగా అనుమతి లేదంటూ అడ్డుకున్నారు. కాసేపు పోలీసులకు రేవంత్ రెడ్డికి మధ్య వాగ్వాదం జరిగింది. తాను ఎంపీనని ఎందుకు అడ్డుకుంటున్నారో చెప్పాలన్నారు. ప్రజాప్రతినిధులకు అనుమతి ఎందుకని ప్రశ్నించారు రేవంత్. అయితే అనుమతి లేనిది లోపలికి వెళ్లనివ్వబోమని పోలీసులు అడ్డుకున్నారు