అగ్ని ప్రమాదంపై రేవంత్ రెడ్డి దిగ్భ్రాంతి..

అగ్ని ప్రమాదంపై రేవంత్ రెడ్డి దిగ్భ్రాంతి..

నాంపల్లి బజార్ ఘాట్ లో జరిగిన ఘోర అగ్ని ప్రమాదం టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి పై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ప్రమాదంలో మృతి చెందిన వారి పట్ల సంతాపం తెలిపారు. ఈ మేరకు ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఈ రోజు ఒక అపార్ట్మెంట్ లో జరిగిన అగ్ని ప్రమాదంలో 9 మంది మృతి చెందడం అత్యంత బాధాకరమైన విషయని ఆవేదన వ్యక్తం చేశారు. హైదరాబాద్ అగ్ని ప్రమాదాలకు నిలయంగా మారిపోయిందని మండిపడ్డారు. వరస అగ్ని ప్రమాదలు జరుగుతున్నా రాష్ట్ర ప్రభుత్వం నివారణ చర్యలు చేపట్టడంలో పూర్తిగా విఫలమైందని విమర్శించారు.

అపార్ట్మెంట్ సెల్లర్ లో కారు మరమ్మతులు ఏంటని.. రెసిడెన్షియల్ ఏరియాలో కెమికల్ డ్రమ్ములు ఎలా నిలువ చేశారని.. ఈ విషయంలో సమగ్ర విచారణ జరపాలని అన్నారు. మృతుల కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలుతుపుతున్నానని.. వారి కుటుంబాలను ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకోవాలని డిమాండ్ చేశారు.

నాంపల్లి బజార్ ఘాట్ ఏరియాలోని ఓ అపార్ట్ మెంట్ లో 2023, నవంబర్ 13వ తేదీ సోమవారం ఉదయం 10 గంటల సమయంలో మంటలు చెలరేగాయి. అపార్ట్ మెంట్ కింద ఉన్న కెమికల్ గోదాంలో మొదటగా మంటలు వచ్చాయి. రసాయనాలు కావటంతో.. మంటలు వేగంగా వ్యాపించాయి. నాలుగు అంతస్తుల అపార్ట్ మెంట్ మొత్తాన్ని మంటలు చుట్టుముట్టాయి. ఈ ఘటనలో ఇప్పటివరకు తొమ్మిది మంది మృతి చెందగా పలువురికి గాయాలయ్యాయి.