‘కేసీఆర్ కుటుంబంలో ఆస్తి తగాదాలు‘

‘కేసీఆర్ కుటుంబంలో ఆస్తి తగాదాలు‘

రాజ్యాంగం ద్వారా వచ్చిన సీఎం పదవిని ఎడమ కాలి చెప్పుతో పోల్చడం కేసీఆర్ అహంకారానికి నిదర్శనమన్నారు కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి. కేసీఆర్ కుటుంబంలో ఆస్తి తగాదాలు జరుగుతున్నాయన్నారు. రాష్ట్రంలో రైతు వ్యతిరేక విధానాలకు, కొత్త వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా తన పాదయాత్ర కొనసాగుతుందన్నారు. కాంగ్రెస్ నేతల యాత్రలు.. వర్గ విభేదాలతో పోల్చవద్దన్నారు. సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, ఎమ్మెల్యే జగ్గారెడ్డి పాదయాత్ర.. ఎవరుచేసినా ప్రజల సమస్యలపైనేనన్నారు. ఏ పార్టీ వాళ్లైనా సరే.. వాళ్ళ పార్టీ జెండాలతో  తన పాదయాత్రలో పాల్గొనవచ్చన్నారు. అచ్చంపేట నుండి హైదరాబాద్ కు పాదయాత్ర మొదలు పెట్టానని.. అవసరమైతే పాదయాత్ర పొడగిస్తానన్నారు. టీఆర్ఎస్ పాలనలో అన్ని వర్గాల ప్రజలు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారన్నారు. ప్రజలను మోసం చేసి కేసీఆర్ రాష్ట్రాన్ని పాలిస్తున్నారన్నారు.

SEE MORE NEWS

న్యూయార్క్ అసెంబ్లీలో ‘కాశ్మీర్’ తీర్మానం

చట్టం తన పని తాను చేసుకుపోతుంది

టీఆర్ఎస్ లో ఈటలకు తప్ప సీఎం అయ్యే అధికారం ఎవరికి లేదు