పాన్ పరాగ్ లు తినే వాడు.. నాపై కామెంట్లు చేస్తాడా : తలసానిపై.. రేవంత్ ఫైర్

పాన్ పరాగ్ లు తినే వాడు.. నాపై కామెంట్లు చేస్తాడా : తలసానిపై.. రేవంత్ ఫైర్

మంగళవారం మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ చేసిన వ్యాఖ్యలపై టీపీసీసీ రేవంత్ రెడ్డి ఘాటుగా స్పందించారు. మే 10వ తేదీ బుధవారం సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డు మీటింగ్ హాజరైన ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. తలసాని ఒళ్లు దగ్గర పెట్టుకుని మాట్లాడాలి.. బాధ్యతాయుతమైన మంత్రి పదవిలో ఉండి ఇష్టానుసారంగా మాట్లాడితే సరికాదు.. తన గురించి ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే సహించేది లేదని హచ్చరించారు రేవంత్ రెడ్డి.

పశు కాపరిగా ఉన్నాడు కాబట్టి తలసానికి పేడ పిసకడం అలవాటు అయినట్లుంది.. అందుకే తనను పిసుకుతాను అంటున్నాడని రేవంత్ ఎద్దేవ చేశారు. చిన్ననాటి నుండి ఆయనకు పేడ పిసకడం అలవాటుగా ఉన్నట్లుందని వ్యాఖ్యనించారు. పాన్ పరాగ్ లు నమిలే వ్యక్తి తనపై మాట్లాడడం సరికాదని..మంత్రి పదవిలో ఉండి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సిగ్గుచేటన్నారు రేవంత్ రడ్డి. రాజకీయాలలో ఉన్నప్పుడు ఆదర్శంగా ఉండడం నేర్చుకోవాలని హితవు పలికారాయన.

కంటోన్మెంట్ బోర్డు మీటింగ్ లో దీర్ఘకాలంగా ఉన్న అంశాలపై బోర్డ్ లో చర్చించామన్నారు రేవంత్ రెడ్డి. కంటోన్మెంట్ ప్రాంతంలో మూసివేసిన రహదారులను తెరవాలని, నాలా సమస్యలను పరిష్కరించాలని చర్చ జరిగిందని వెల్లడించారు. సివరెజ్ వ్యవస్థ సరిగా లేదు..కంటోన్మెంట్ లో సివరేజ్ ప్లాంట్ ప్రణాళిక ఏర్పాటు చేయాలని..కలుషిత నీటి వల్ల నగర ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వం నుండి కంటోన్మెంట్ కు రావాల్సిన నిధులు విడుదల చేయాలని డిమాండ్ చేసిన రేవంత్ రెడ్డి.. కోర్టుకు వెళ్లి అయిన దీనిపై పోరాడాలన్నారు. కంటోన్మెంట్ ఆదాయాన్ని రాష్ట్ర ప్రభుత్వం దొంగిలిస్తుందని విమర్శించారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కేంద్రంతో మాట్లాడి రక్షణ శాఖ మంత్రితో సమన్వయం చేసుకుంటు కంటోన్మెంట్ సమస్యలను తీర్చాలని రేవంత్ రెడ్డి కోరారు.