డిపాజిట్ రాని బీజేపీ.. బీసీ సీఎంను ఎలా చేస్తది: రేవంత్ రెడ్డి

డిపాజిట్ రాని బీజేపీ.. బీసీ సీఎంను ఎలా చేస్తది: రేవంత్ రెడ్డి

డిపాజిట్ రాని బీజేపీ పార్టీ.. బీసీ ముఖ్యమంత్రిని ఎలా చేస్తుందని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఎద్దేవా చేశారు. గత ఎన్నికల్లో బీజేపీకి 105 స్థానాలల్లో డిపాజిట్లు గల్లంతయ్యాయని... వచ్చే ఎన్నికల్లో కూడా 110 స్థానాల్లో బీజేపీకి డిపాజిట్లు గల్లంతు అవుతాయని జోష్యం చెప్పారు. బీజేపీ 10 రాష్ట్రాల్లో అధికారంలో ఉంటే.. ఒకరు మాత్రమే ఓబీసీ ముఖ్యమంత్రి ఉన్నారని.. బీసీ కుల గణన చేయాలని కాంగ్రెస్ డిమాండ్ చేస్తున్నా.. బీజేపీ పట్టించుకోలేదన్నారు. బీసీ కుల గణన చేయలేని పార్టీ.. బీసీ సీఎం ఎలా చేస్తుందని  ఆయన ప్రశ్నించారు.

2023, నవంబర్ 19వ తేదీ ఆదివారం హైదరాబాద్ సోమాజిగూడలో మీట్ ది ప్రెస్ కార్యమంలో రేవంత్ రెడ్డి పాల్గొని మాట్లాడుతూ.. "  రైతులకు ఉచిత విద్యుత్ ఇచ్చిన తొలి పార్టీ కాంగ్రెస్. చేసిన అభివృద్ధిని చెప్పి.. ఓట్లు అడిగే స్థితిలో కేసీఆర్ లేరు.  కాంగ్రెస్ అధికారంలోకి రాగానే సచివాలయంలో ప్రజా దర్బార్ నిర్వహిస్తాం. ఎస్సీ వర్గీకరణపై గతంలోనే బీజేపీ హామీ ఇచ్చిందని..  ఎస్సీ వర్గీకరణపై ఆర్డినెన్స్ తెస్తే కాంగ్రెస్ మద్దతు ఇస్తుంది. కేంద్ర ప్రభుత్వం అనుకుంటే.. 48 గంటల్లో ఆర్డినెన్స్ తేవొచ్చు.. కానీ, మాదిగల దృష్టి మరల్చేందుకు బీజేపీ ఎత్తుగడలు వేస్తోంది. బీజేపీ చెప్పే మాటలు.. దళితులు ఎవరూ నమ్మరు. ఎన్నికలు అయ్యాక ఎస్సీ వర్గీకరణ హామీని బీజేపీ పట్టించుకోదు" అని అన్నారు.