ఊరూరా మంచినీళ్లు రాలె.. కానీ బెల్టుషాపులొచ్చినయ్: రేవంత్

ఊరూరా మంచినీళ్లు రాలె.. కానీ బెల్టుషాపులొచ్చినయ్: రేవంత్

కొడంగల్ కు  కృష్ణా నీళ్లు ఎందుకు రాలేదని ప్రశ్నించారు టీ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. కొడంగల్ లోని మద్దూరులో కాంగ్రెస్ విజయభేరి యాత్ర నిర్వహించారు. ఈ సందర్బంగా మాట్లాడిన రేవంత్.. మద్దూరుకు నీళ్లు రాలే కానీ..  ఊరురా బెల్టు షాపులొచ్చాయన్నారు. కాంగ్రెస్ వస్తే  రైతుబంధు ఆగిపోతుందని.. కేసీఆర్ తప్పుడు ప్రచారం చేస్తున్నారని విమర్శించారు రేవంత్.  కాంగ్రెస్ వస్తే రైతుబందు కొనసాగిస్తామని చెప్పారు. ఓటెయ్యకుంటే దళితబంధు ఇవ్వమని బెదిరిస్తున్నారని..  కాంగ్రెస్ వస్తే దళితబందు కొనసాగిస్తామన్నారు. కేసీఆర్ మతితప్పి మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు.

వికారాబాద్- కొడంగల్ రైలు ఎందుకు రాలేదని ప్రశ్నించారు రేవంత్.  ఏం చేయనోళ్లు ఓట్లెలా అడుగుతారన్నారు.   దొంగ హామీలతో కొడంగల్ లో  బీఆర్ఎస్ గెలిచిందన్నారు రేవంత్.   రైతులను ఆదుకున్నది కాంగ్రెస్ సర్కారేనని చెప్పారు.  మద్దూరును అభివృద్ధి చేసింది తానేనన్నారు. మద్దూరులో  30 పడకల ఆస్పత్రి తాము కట్టించిందేనని .. కాంగ్రెస్ వచ్చాక  100 పడకల ఆస్పత్రి నిర్మిస్తామన్నారు.  కాంగ్రెస్ వస్తే కొడంగల్ ఎత్తిపోతల పథకం పూర్తి చేస్తామన్నారు.   వచ్చే నెల నుంచి 200 యూనిట్ల విద్యుత్ ఫ్రీగా ఇస్తామని చెప్పారు.